Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: భారత్ భారీ విజయం.. ఆ సంప్రదాయాన్ని కొనసాగించిన హర్మన్‌ప్రీత్!

IND vs ENG: మహిళల టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. గత 17 ఏళ్లుగా ఓటమెరుగని జట్టుగా దూసుకెళ్తోంది. తాజాగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగిన ఏకైక టెస్ట్‌లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ముంబై వేదికగా శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 347 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా భారత్ చరిత్రకెక్కింది. ఈ భారీ విజయంతో భారత ఆటగాళ్లు వినూత్న రీతిలో సంబరాలు చేసుకున్నారు. ట్రోఫీతో ఫొటోలు దిగే సమయంలో విభిన్నంగా సెల్ఫీలు తీసుకొని ట్రెండింగ్‌లో నిలిచారు. ముఖ్యంగా జెమీమా రోడ్రిగ్స్ నేలపై పడుకొని సెల్ఫీ తీయడం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.

IND vs ENG: Harmanpreet Kaur continues MS Dhoni tradition hands over trophy to debutant Youngsters

ట్రోఫీతో ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ మొత్తం ఫోజ్ ఇవ్వగా.. మొబైల్‌తో ముందుకు వచ్చి నేలపై పడుకున్న జెమీమా.. సెల్ఫీ తీసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైర్‌గా మారింది. అభిమానులు ఈ ఫొటోను చూసి 'ఓర్నీ మీ ఏశాలో'అని కామెంట్ చేస్తున్నారు. భారత మహిలా క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. పురుషుల క్రికెట్ సంప్రదాయాన్ని కొనసాగించింది.

ఈ ఏకైక మ్యాచ్ విజయానంతరం ట్రోఫీ అందుకొని నేరుగా జట్టులోకి కొత్తగా వచ్చిన అరంగేట్ర ప్లేయర్‌కు అందజేసింది. 2007 టీ20 ప్రపంచకప్ విజయానంతరం టైటిల్ అందుకున్న అప్పటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తీసుకెళ్లి నేరుగా యువ ఆటగాళ్లకు అందజేశాడు. అప్పటి నుంచి ప్రతీ కెప్టెన్ టైటిల్‌ను తీసుకెళ్లి టీమ్‌లో ఉన్న యువ ఆటగాళ్లకు అందజేయం సంప్రదాయంగా పాటిస్తున్నారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారు. ఇటీవల టీ20ల్లో టీమిండియాను నడిపించిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాడు. మహిళా క్రికెట్‌లో కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడం చర్చనీయాంశమైంది.

479 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. దీప్తి శర్మ(4/32), పూజా వస్త్రాకర్(3/23), రాజేశ్వరి గైక్వాడ్(2/20) ధాటికి 131 పరుగులకే కుప్పకూలింది. ఒక్క సెషన్‌లోనే ఇంగ్లండ్ ఆలౌటవ్వడం గమనార్హం. ఇలా ఒక్క సెషన్‌లోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన జట్టుగా భారత్ రికార్డ్ కెక్కింది. ఇంగ్లండ్ బ్లాటర్లలో చార్లీ డీన్(33 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌సేన తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్ చేసింది. రంగేట్ర ప్లేయర్ సతీష్ శుభా(69)తో పాటు జెమీమా రోడ్రిగ్స్(68), యస్తికా భాటియా(66), దీప్తి శర్మ(67) హాఫ్ సెంచరీలతో రాణించారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. దీప్తి శర్మ(5/7) ధాటికి 136 పరుగులకే కుప్పకూలింది. నాట్ సీవర్ బ్రంట్(59) ఒక్కతే హాఫ్ సెంచరీతో రాణించింది. దాంతో టీమిండియాకు 392 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌ 186/6 డిక్లేర్ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్(44 నాటౌట్) రాణించింది.

Story first published: Saturday, December 16, 2023, 14:55 [IST]
Other articles published on Dec 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+