హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్.. ఇంగ్లండ్ పర్యటనలోనూ అతనే కెప్టెన్!

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జాక్‌పాట్ కొట్టేసాడు. గత రెండేళ్లుగా గాయాలతో సతమతమై జట్టుకు దూరమైన హార్దిక్.. ఐపీఎల్ 2022 సీజన్‌తో మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. తనదైన ఆటతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనే కాకుండా.. కెప్టెన్‌గా సత్తా చాటాడు.
ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ చాంపియన్‌గా నిలబెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ ప్రదర్శనతో మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్.. ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలోనూ భారత జట్టును నడిపించనున్నాడు.

టెస్ట్ మ్యాచ్ అనంతరం..
బర్మింగ్‌హామ్ వేదికగా శుక్రవారం నుంచి ఇంగ్లండ్- భారత జట్ల మధ్య నిర్ణయాత్మక ఐదో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టెస్టు అనంతరం ఇరు జట్లు మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి. కాగా టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత సీనియర్ ఆటగాళ్లందరూ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సౌతాఫ్రికా, ఐర్లాండ్‌తో సిరీస్‌లకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉన్నారు.

సీనియర్లకు విశ్రాంతి..
వీళ్లంతా ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జూలై 5న ముగియనుంది. ఇక టీ20 సిరీస్ జూలై 7 నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20కు సన్నద్దం కావడానికి కేవలం ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టునే ఇంగ్లండ్‌తో తొలి టీ20లో ఆడించాలని బీసీసీఐ యోచిస్తోంది. టెస్ట్ మ్యాచ్ ఆడిన సీనియర్ ఆటగాళ్లకు మూడు రోజులు విశ్రాంతివ్వాలని బోర్డు భావిస్తోంది. తర్వాతి రెండు మ్యాచ్‌లకు రోహిత్, కోహ్లీ, పంత్ తిరిగి జట్టులోకి రానున్నారు. ఇదే జరిగితే హార్దిక్ సారథ్యంలోనే టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది.

ఐర్లాండ్‌తో ఆడిన జట్టే..
'ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడిన భారత జట్టు తొలి టీ20లో తలపడనుంది. రెండో టీ20 నుంచి స్టార్ ఆటగాళ్లందరూ జట్టులోకి వస్తారు. వారికి కాస్త విశ్రాంతి అవసరం. కాగా ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఈ టీ20 సిరీస్ ముగిసే వరకు ఉంటారు" అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇక ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications