ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఇంగ్లండ్‌తో సోమవారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. 39/6 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 367 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్(5/104) ఐదు వికెట్లతో భారత్‌కు చిరస్మరణీయమైన వియాజయాన్నందించాడు. సిరాజ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ(4/126) నాలుగు వికెట్లు తీయగా ఆకాష్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఆఖరి రోజు భారత బౌలర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి 35 పరుగుల డిఫెండ్ చేశారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ విజయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియాను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. 'మేం కొన్ని గెలిచాం.. మరికొన్ని ఓడాం.. కానీ ఎప్పుడూ ఓటమికి లొంగిపోలేదు. వెల్‌డన్ బాయ్స్'అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'ఖచ్చితంగా బ్రదర్.. నువ్వు చెప్పినట్లే ఈ టీమ్ చేసింది. ఓటమిని అంగీకరించకుండా ఆఖరి వరకు పోరాడింది'అని ట్వీట్ చేశాడు.