Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనకు స్వింగ్ సింగ్.. గంభీర్ నిర్ణయం!

ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌‌కు టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న టీమిండియాకు ఈ సిరీస్‌ గెలవడం తప్పనిసరి. అంతేకాకుండా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఈ సిరీస్‌పై అందరి దృష్టి నెలకొంది.

గత ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా డ్రా చేసుకుంది. 2007లో చివరిసారిగా ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా విజయం సాధించింది. ఆ తర్వాత విజయానికి దగ్గరగా వచ్చినా చివర్లో చేజార్చుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమైంది. బుమ్రా మినహా మరే బౌలర్ రాణించలేకపోయాడు. బుమ్రాకు అండగా రాణించాల్సిన సిరాజ్, ఆకాశ్ దీప్ తేలిపోయారు. ఈ క్రమంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంపై గంభీర్ ఫోకస్ పెట్టాడు. బంతిని స్వింగ్ చేయగల అర్ష్‌దీప్ సింగ్‌ను టెస్ట్ టీమ్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నాడట.

IND vs ENG Gautam Gambhir Prioritizes Arshdeep Singh in Bowling Unit Reports

ఇటీవల ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ తన స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇంగ్లండ్ కండిషన్స్ అతని బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతాయని గంభీర్ భావిస్తున్నాడు. లెఫ్టార్మ్ పేసర్ బౌలర్ కావడం కూడా అతనికి కలిసొచ్చే అంశంగా మారింది. ఇప్పటి వరకు టీ20లకే పరిమితమైన అర్ష్‌దీప్ సింగ్.. 63 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు తీసాడు. 9 వన్డేల్లో 14 వికెట్లు పడగొట్టాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొనసాగుతున్న అర్ష్‌దీప్ సింగ్.. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయలేదు. 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ 66 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ‌, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలతో పాటు అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.

Story first published: Wednesday, May 14, 2025, 16:25 [IST]
Other articles published on May 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+