Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఈ నాలుగు తప్పిదాలే ఇంగ్లండ్ పతనాన్ని శాసించాయి!

భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ దారుణంగా విఫలమైంది. బజ్‌బాల్ అంటూ దూకుడుగా ఆడి మూల్యం చెల్లించుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సంచలన విజయాన్ని అందుకున్న ఆ జట్టు.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టు పతనాన్ని శాసించింది.

రెండున్నర నెలల పాటు సాగిన ఈ సుదీర్ఘ పర్యటనలో ఇంగ్లండ్ నాలుగు తప్పిదాలను చేసింది. ఈ తప్పిదాలు చేయకుండా ఉంటే చారిత్రాత్మక విజయాన్ని అందుకునేది.

IND vs ENG Four moments England will rue in their series loss to Team India

1.బుమ్రా సెన్సేషనల్ బౌలింగ్..
స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగడం ఇంగ్లండ్ పతనాన్ని శాసించింది. రివర్స్ స్వింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్న అతను.. జో రూట్‌కు చుక్కలు చూపించాడు. బుమ్రా రివర్స్ స్వింగ్‌ను ఎదుర్కొనే వ్యూహాలను ఇంగ్లండ్ రచించలేకపోయింది. బజ్‌బాల్ పేరిట దూకుడుగా ఆడే ప్రయత్నంలో పేలవ షాట్ల‌తో వికెట్లు సమర్పించుకుంది. బుమ్రా బౌలింగ్‌ను తెలివిగా ఎదుర్కొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.

2. కీలక క్యాచ్ నేలపాలు చేయడం..
రాజ్‌కోట్ టెస్ట్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను జోరూట్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన రోహిత్(131) సెంచరీతో భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును జడేజాతో కలిసి ఆదుకున్నాడు. రోహిత్ ఇచ్చిన క్యాచ్ పట్టి ఉంటే భారత్ మరింత ఒత్తిడికి గురయ్యేది. అప్పుడు ఇంగ్లండ్ విజయానికి అవకాశం ఉండేది.

3. జోరూట్ నిర్లక్ష్యపు షాట్స్..
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ నిర్లక్ష్యపు బ్యాటింగ్ కూడా ఆ జట్టు పతనాన్ని శాసించింది. బజ్‌బాల్ అప్రోచ్‌తో తన సహజ శైలికి భిన్నంగా దూకుడుగా ఆడే ప్రయత్నంలో అతను పలుమార్లు ఔటయ్యాడు. అనవసరపు షాట్లతో మూల్యం చెల్లించుకున్నాడు. సిరీస్ చివర్లో అతను తన సహజశైలిలో ఆడి ఫామ్‌లోకి వచ్చినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

4.ఆలస్యంగా స్టోక్స్ బౌలింగ్..
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ సిరీస్‌లో బౌలింగ్ చేయకపోవడం కూడా ఇంగ్లండ్ పతనాన్ని శాసించింది. ఆఖరి టెస్ట్‌లో బౌలింగ్ చేసిన అతను తొలి బంతికే సెంచరీ హీరో రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఈ సిరీస్ ఆరంభం నుంచి బౌలింగ్ చేసి ఉంటే.. మిగతా బౌలర్లు కాస్త స్వేచ్చగా బౌలింగ్ చేసేవారు.

Story first published: Monday, March 11, 2024, 15:12 [IST]
Other articles published on Mar 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+