Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా, అండర్సన్‌ మధ్య జరిగిన గొడవ అదే.. అందుకే భారత ఆటగాళ్లలో ఆ ఫైర్‌! అసలు విషయాన్ని చెప్పేసిన కోచ్‌!

IND vs ENG: Fielding coach R Sridhar shares what happened between Bumrah and Anderson in Day 3
James Anderson to Jasprit Bumrah after facing the bouncer barrage at Lord’s

లండన్: రెండో టెస్టులో ఇంగ్లండ్, భారత్ జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఆటలో ఆధిపత్యం చెలాయించేందుకు ఆటగాళ్లు గొడవలు పడ్డారు. మూడో రోజు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. నాలుగో రోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అండర్సన్‌ మధ్య మరో వివాదం చోటుచేసుకుంది.

ఇక చివరి రోజు బుమ్రాని రెచ్చగొట్టారు ఇంగ్లండ్ ప్లేయర్స్. మార్క్‌ వుడ్, అండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని గాయపర్చే ప్రయత్నం చేస్తూనే తమ నోటికి పని చెప్పారు. బట్లర్ కూడా బుమ్రాపై మాటల యుద్దానికి దిగాడు. దీంతో కోహ్లీ వారికీ ధీటుగా బదులిచ్చాడు. అయితే అసలు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఏం జరిగిందనేది తాజాగా వెలుగులోకి వచ్చింది.

90 మైళ్ల వేగంతో

90 మైళ్ల వేగంతో

లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జేమ్స్ అండర్సన్‌కు బౌన్సర్లు సంధించిన జస్ప్రీత్ బుమ్రా అతడికి క్షమాపణ చెప్పాడట. కానీ ఇండియన్ పేస్ గుర్రం క్షమాపణను పట్టించుకోని జిమ్మీ.. బుమ్రా పక్కకు తోసేసి బూతు మాటలు అన్నాడట. ఆ మాటలే భారత జట్టు క్రికెటర్లలో అగ్నిజ్వాలను రగిలించాయని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ తెలిపారు.

వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్లో శ్రీధర్‌ ఈ విషయాలను చెప్పాడు. 'ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో చివరి బ్యాట్స్‌మన్‌గా జేమ్స్ అండర్సన్‌ వచ్చాడు. అప్పటికే ఆధిక్యం కోల్పోయిన భారత్ త్వరగా వికెట్లు తీయాల్సిన పరిస్థితి. దాంతో జస్ప్రీత్‌ బుమ్రా 90 మైళ్ల వేగంతో జిమ్మీకి బంతులు వేశాడు. షార్ట్‌ పిచ్‌ బంతులు సంధించడంతో అవి అండర్సన్‌కు తగిలాయి' అని శ్రీధర్‌ తెలిపాడు.

IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనలో సరికొత్త రోహిత్‌ శర్మను చూస్తున్నా: సచిన్‌

బుమ్రాను పక్కకు తోసేశాడు

బుమ్రాను పక్కకు తోసేశాడు

'బుమ్రా షార్ట్‌ పిచ్‌ బంతులు విసురుతుండడంతో అండర్సన్‌ స్పందించాడు. ఇంత వేగంగా ఎందుకు వేస్తున్నావు?, నీకు నేనిలాగే వేశానా?, ఇప్పటి వరకు నువ్వు 80 మైళ్ల వేగంతో వేశావు, నన్ను చూడగానే 90 మైళ్ల వేగంతో ఎందుకు విసురుతున్నావు? అని జిమ్మీ అన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ ముగియగానే కుర్రాళ్లంతా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చేశారు.

ఆ తర్వాత బుమ్రా వేగంగా వెళ్లి జిమ్మీ భుజం తట్టాడు. ఉద్దేశపూర్వకంగా బంతులు వేయలేదని వివరించాలన్నది అతడి ఉద్దేశం. బుమ్రా ఎంత మంచి వ్యక్తో మనందరికీ తెలుసు. అందుకే, ఆ వ్యవహారం అంతటితో ముగించేందుకు అతడి వద్దకు వెళ్లాడు. కానీ అండర్సన్‌ బుమ్రాను పక్కకు తోసేశాడు' అని ఫీల్డింగ్‌ కోచ్‌ తెలిపాడు.

అదే జ్వాలను రగిలించింది

అదే జ్వాలను రగిలించింది

'అక్కడితో ఆగకుండా.. ఇతర బ్యాట్స్‌మెన్‌కు నువ్వు 85 మైళ్ల వేగంతో బంతులేశావు. నాకేమో 90 మైళ్లతో వేశావు. ఇది మోసం. నేను అంగీకరించను అని అండర్సన్‌ అన్నాడు. ఇదంతా జట్టును ఏకతాటిపైకి తీసుకొచ్చింది. అంతకుముందు అలా లేదని కాదు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిలో జ్వాలను రగిలించింది.

దాని ప్రభావం ఐదో రోజు మైదానంలో కనిపించింది' అని శ్రీధర్‌ తెలిపారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఇంకో విషయం కూడా చెప్పాడు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అనధికార ఫాస్ట్‌ బౌలర్ల క్లబ్‌ ఉండేదట. బౌలర్లకు వేగంగా బంతులు వేయొద్దన్న నియమం ఉండేదట. కాలం మారే కొద్దీ ఆ క్లబ్‌ ఆనవాళ్లు లేకుండా పోయిందని శ్రీధర్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బ్యాట్స్‌మన్‌, బౌలర్ క్రీజులో ఎవరున్నా.. ఒకేరకంగా బంతులు వేస్తున్నారన్నాడు.

రాఠోడ్‌ ఆవేదన

రాఠోడ్‌ ఆవేదన

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌ ఔటవ్వగానే 180 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌ను ఇబ్బంది పెట్టొచ్చని హెడ్ కోచ్‌ రవిశాస్త్రి తనకు చెప్పారని శ్రీధర్‌ తెలిపారు. ఎప్పుడూ ఫాస్టింగ్‌ చేసే శాస్త్రి.. ఆ రోజు ఉదయమే భోజనం చేసి ఆత్రుతగా కూర్చుకున్నాడని తెలిపాడు. ఇక బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అయితే విపరీతంగా బాధపడిపోయాడట.

'ఐదు రోజులు ఎంతో కష్టపడి బంతులు విసిరాను. బౌలర్లు కనీసం 30 పరుగులైనా చేయకుంటే ఎలా?' అని రాఠోడ్‌ ఆవేదన చెందాడట. కానీ బుమ్రా, షమీ అద్భుతం చేయడంతో ఆనందంలో తేలిపోయాడని శ్రీ వివరించాడు. బుమ్రా, షమీ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి తిరిగొచ్చేటప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా చప్పట్లు కొట్టాలని విరాట్‌ కోహ్లీ జట్టు సభ్యులను ఆదేశించినట్లు శ్రీధర్‌ తెలిపాడు.

Story first published: Friday, August 20, 2021, 18:41 [IST]
Other articles published on Aug 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+