For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: పాకిస్థాన్‌లో పుట్టి భారత్‌లో చచ్చింది! పేలుతున్న సెటైర్స్!

ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. భారత్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 4-1 తేడాతో చిత్తయ్యింది. బజ్‌బాల్ అప్రోచ్‌తో పరిస్థితులతో సంబంధం లేకుండా దూకుడుగా ఆడిన ఇంగ్లండ్.. వరుసగా నాలుగో మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

హైదరాబాద్ టెస్ట్‌లో విజయం సాధించి ఈ సిరీస్‌లో శుభారంభం చేసిన ఆ జట్టు.. తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ ఘోర పరాజయం నేపథ్యంలో ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌పై మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

IND vs ENG Fans trolls England s Bazball approach after India win series 4-1

బజ్‌బాల్ అప్రోచ్‌ను పక్కనపెట్టి అసలు సిసలు టెస్ట్ క్రికెట్ ఆడాలని ఇప్పటికే మైకేల్ వాన్, అలిస్టర్ కుక్ వంటి మాజీ క్రికెటర్లు సూచించగా.. ఓ ప్రణాళిక, పద్దతిలేని పిచ్చి అప్రోచ్‌తో ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు.

అభిమానులు అయితే ఫన్నీ మీమ్స్‌తో జోకులు పేల్చుతున్నారు. పాకిస్థాన్‌లో పుట్టిన బజ్‌బాల్.. భారత్‌లో చచ్చిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇంగ్లండ్ ఈ బజ్‌బాల్ అప్రోచ్‌ను పక్కనపెడుతుందా..? కొనసాగిస్తుందా? అనేది చూడాలని ట్వీట్ చేస్తున్నారు. బజ్‌బాల్‌తో పాకిస్థాన్‌లో గెలిచిన ఇంగ్లండ్.. భారత్‌లో మాత్రం తేలిపోయిందని సెటైర్లు పేల్చుతున్నారు.

ఈ సిరీస్‌లో ఇంగ్లండ్.. బజ్‌బాల్ అప్రోచ్‌తో మూల్యం చెల్లించుకుందని కామెంట్ చేస్తున్నారు. 259 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. రవిచంద్రన్ అశ్విన్(5/77) ధాటికి 195 పరుగులకే కుప్పకూలింది.

జో రూట్(128 బంతుల్లో 12 ఫోర్లతో 84) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. జానీ బెయిర్ స్టో(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) పర్వాలేదనిపించాడు.మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అశ్విన్‌కు అండగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/38), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది.

అంతకుముందు 473/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. 4 పరుగుల వ్యవధిలో చివరి రెండు వికెట్లు కోల్పోయి 477 పరుగులకు ఆలౌటైంది. రోహిత్(103), శుభ్‌మన్ గిల్(110) సెంచరీలతో రాణించగా.. దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56), యశస్వి జైస్వాల్(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్(5/173) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

Story first published: Saturday, March 9, 2024, 20:42 [IST]
Other articles published on Mar 9, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+