Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: విరాట్ కోహ్లీకి గాయమా? సాకుతో తప్పించారా?

ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. అతను కుడి మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, ముందస్తు చర్యల్లో భాగంగానే విశ్రాంతి కల్పించామని టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. అయితే కోహ్లీ గైర్హాజరీపై అతని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన కోహ్లీకి మోకాలి నొప్పి అంటే నమ్మశక్యంగా లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీకి నిజంగానే మోకాలి నొప్పి ఉందా? లేక సాకుతో తప్పించారా? అని ప్రశ్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క శతకం నమోదు చేశాడు. 8 సార్లు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకే ఔటయ్యాడు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది.

IND vs ENG Fans Troll Rohit Sharma Over Virat Kohli s Absence in 1st ODI Against England

ఆసీస్ పర్యటన అనంతరం కుటుంబ సభ్యులతో గడిపిన కోహ్లీ.. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఓ మ్యాచ్ ఆడాడు. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 ఏళ్ల తర్వాత బరిలోకి దిగాడు. కానీ ఈ మ్యాచ్‌లోనూ 15 బంతుల్లో 6 పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కానీ కోహ్లీ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.

ఈ క్రమంలోనే తన బ్యాటింగ్‌ శైలికి సరిపోయే వన్డే ఫార్మాట్‌తోనే కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ గాయం కారణంగా అతను తొలి వన్డేకు దూరమవ్వడం అభిమానులకు నిరాశను మిగిల్చింది. ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లీ తన కుడి మోకాలికి పట్టీ వేసుకొని కనిపించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్‌ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఈ ఇద్దరూ వరుసగా ఔటయ్యారు. దాంతో ఇంగ్లండ్ 111 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

Story first published: Thursday, February 6, 2025, 16:07 [IST]
Other articles published on Feb 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+