టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్‌ల్లో రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతుండటంతో సోషల్ మీడియా వేదికగా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు.
హైదరాబాద్ టెస్ట్‌లో 24, 39 పరుగులే చేసిన రోహిత్.. అచ్చొచ్చిన అమ్మమ్మ ఊరు వైజాగ్‌లో చెలరేగుతాడని, భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులే చేసి వెనుదిరిగాడు.

ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ స్టన్నింగ్ డెలివరీకి రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే వెనుదిరిగాడు.
వైజాగ్ ఓవర్‌కాస్ట్ కండిషన్స్‌ను అడ్వాంటేజ్‌గా మార్చుకున్న అండర్సన్.. సూపర్ ఇన్‌స్వింగర్‌తో రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో బంతిని అతను ఫుల్లర్ లెంగ్త్‌లో వేయగా.. రోహిత్ డిఫెన్స్ చేస్తూ కవర్స్‌వైపు ఆడాలనుకున్నాడు. కానీ బంతి అద్భుతంగా ఇన్‌స్వింగ్ అయ్యి ఆఫ్ వికెట్‌ను లేపేసింది. ఈ స్టన్నింగ్ డెలివరీకి రోహిత్ బిత్తరపోయాడు.
రోహిత్ తాజా వైఫల్యంపై అభిమానులు మండిపడుతున్నారు. నడిపించాల్సిన నాయకుడే చెత్త ప్రదర్శన చేస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్‌ల్లో గత 8 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయలేదని, కెప్టెన్సీ లేకుంటే ఎప్పుడో జట్టుకు దూరమయ్యేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
సౌతాఫ్రికా పర్యటనలో 5(14), 0(8), 39(50), 16(22)తో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌ల్లోనూ అదే ప్రదర్శనను కొనసాగించాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు జట్టులో దూకుడు ఆడే సంప్రదాయాన్ని తీసుకోచ్చానని చెప్పిన రోహిత్.. అంకెలు, రికార్డులు ఓవర్‌రేటేడ్ అంటూ కామెంట్ చేశాడు. అసలు రికార్డులు, సెంచరీలను పట్టించుకోవద్దని అభిప్రాయపడ్డాడు.
ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఫ్యాన్స్ రోహిత్‌ను ట్రోల్ చేస్తున్నారు. 'ఇదేనా నీ దూకుడు.. నీవు నీ చేతగాని మాటలు..'అంటు మండిపడుతున్నారు. రికార్డులు కూడా విజయంలో భాగమవుతాయని, ఆటగాడికి ప్రత్యేక గుర్తింపును ఇవ్వడంతో పాటు మరింత కసిగా ఆడేలా చేస్తాయనే విషయాన్ని రోహిత్ గుర్తించలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సిరీస్‌లో రోహిత్ ఇలానే విఫలమైతే.. అతని టెస్ట్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడుతుందని హెచ్చరిస్తున్నారు.
రోహిత్ ఔటైన వెంటనే.. డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్(17) కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగడంతో భారత్ 30 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్(37 బ్యాటింగ్), శ్రేయస్ అయ్యర్(28 బ్యాటింగ్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.