Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG 3rd ODI: స్తంభించిన హాట్‌స్టార్.. ఫ్యాన్స్ అసహనం!

ఇంగ్లండ్ వర్సెస్ మూడు వన్డే సందర్భంగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సేవలు స్థంభించాయి. ఈ సిరీస్‌కు అధికారిక ఓటీటీ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న హాట్‌స్టార్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను హాట్‌స్టార్ మొత్తం 8 భాషాల్లో కామెంట్రీ అందిస్తూ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అయితే మూడో వన్డే సందర్భంగా సాంకేతిక లోపం కారణంగా హిందీ కామెంట్రీలో మాత్రమే మ్యాచ్‌ ప్రసారం జరిగింది. లాంగ్వేజ్ మార్చుకునే అవకాశం లేకుండా పోయింది.

మ్యాచ్ ఆరంభంలోనైతే ప్రత్యక్ష ప్రసారమే ఆగిపోయింది. దాంతో ప్రేక్షకులు టాస్‌ను చూడలేకపోయారు. ఆ తర్వాత కాసేపటికి హిందీ కామెంట్రీలో మ్యాచ్‌ ప్రసారం జరిగింది. 20 ఓవర్ల వరకు కూడా ఈ సమస్య పరిష్కారం లభించలేదు. ఆ తర్వాత హాట్ స్టార్ సాంకేతిక సమస్యను పరిష్కరించి 8 భాషాల కామెంట్రీతో మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది.

IND vs ENG Fans Slam Hotstar Over Glitch and Poor Coverage During 3rd ODI

హాట్ స్టార్ స్థంభించడంతో అభిమానులు చికాకుకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా హాట్ స్టార్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'హాట్ స్టార్ సర్వర్ డౌన్ అయ్యిందా?'అంటూ ప్రశ్నించారు. డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కూడా ఈ సమస్య ఏంటని మండిపడ్డారు. కనీసం ఇంగ్లీష్ కామెంట్రీనైనా డిఫల్ట్ లాంగ్వెజ్‌గా పెట్టండని రిక్వెస్ట్ చేశారు.

మీ చెత్త సర్వీస్ కారణంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడలేకపోయామని అసహన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హాట్ స్టార్ సాంకేతిక సమస్యకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ ఎక్స్‌వేదికగా వైరల్ అయ్యాయి. హాట్‌స్టార్ యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. దాదాపు 1624 మంది హాట్‌స్టార్ సమస్యను తెలియజేస్తూ ట్వీట్స్ చేశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ(1) వికెట్ ఆదిలోనే కోల్పోయినా.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52) రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే కోహ్లీ ఔటవ్వగా.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి గిల్ శతకం పూర్తి చేసుకున్నాడు.

Story first published: Wednesday, February 12, 2025, 15:49 [IST]
Other articles published on Feb 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+