Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ షాటా..? ఆ కుర్చీ మడత పెట్టి.. (వీడియో)

భారత పర్యటనలో జో రూట్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ జోరూట్(18) తీవ్రంగా నిరాశపరిచాడు. మరోసారి చెత్త షాట్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ షాట్ ఆడిన జో రూట్ స్లిప్‌లో యశస్వి జైస్వాల్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు.

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 40వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని బుమ్రా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. ముందుగానే రివర్స్ స్వీప్ షాట్ ఆడే పొజిషన్‌కు వచ్చిన జోరూట్ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. దాంతో బంతి సెకండ్ స్లిప్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ వైపు వేగంగా దూసుకెళ్లింది. అతను అంతే వేగంగా బంతిని అందుకున్నాడు. దాంతో జోరూట్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

IND vs ENG: Fans reacts as Joe Root fails again with Bazball approach vs Jasprit Bumrah

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక టెస్ట్‌ల్లో బుమ్రా బౌలింగ్‌లో జోరూట్ ఔటవ్వడం ఇది 9వ సారి. దాంతో నెటిజన్లు, మాజీ క్రికెటర్లు జోరూట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అనవసర షాట్ అని, బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ అవసరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులైతే జో రూట్‌పై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ షాటా? ఆ కుర్చి మడతపెట్టి.. అని కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే 207/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ధాటికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో చెత్త షాట్‌తో జోరూట్.. వెనుదిరగ్గా.. కుల్దీప్ స్పిన్ ధాటికి బెయిర్ స్టో(0), బెన్ డక్కెట్(153) వెనుదిరిగారు. క్రీజులో బెన్ ఫోక్స్(0)తో పాటు బెన్ స్టోక్స్ ఉన్నారు.

ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 445 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌తో 112), రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) శతకాలతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

రవిచంద్రన్ అశ్విన్(89 బంతుల్లో 6 ఫోర్లతో 37), ధ్రువ్ జురెల్(104 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జస్‌ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) సైతం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(4/114) నాలుగు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్‌లీ, జోరూట్ తలో వికెట్ పడగొట్టారు. రెహ్మాన్ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Story first published: Saturday, February 17, 2024, 11:26 [IST]
Other articles published on Feb 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+