టీమిండియా యువ బ్యాటర్ రజత్ పటిదార్‌ను దురదృష్టం వెంటాడింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో అనూహ్యంగా అవకాశం అందుకున్న ఈ ఆర్‌సీబీ స్టార్.. విచిత్రకర రీతిలో పెవిలియన్ చేరాడు. అరంగేట్ర మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చాలని కలలుగన్న రజత్ పటీదార్‌ను దురదృష్టం వెంటాడింది.
యువ ఓపెనర్, సెంచరీ హీరో యశస్వి జైస్వాల్‌తో సాధికారికంగా బ్యాటింగ్ చేసిన రజత్ పటీదార్ అన్ లక్కీగా పెవిలియన్ చేరాడు. 72 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేసిన రజత్ పటీదార్ రెహాన్ అహ్మద్ వేసిన 72వ ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఓవర్ తొలి బంతిని రెహాన్ అహ్మద్ ఫుల్లర్ డెలివరీగా వేయగా.. రజత్ పటీదార్ డిఫెండ్ చేశాడు.

అయితే బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి రజత్ పటీదార్ గ్లోవ్స్‌ను ముద్దాడి పిచ్ అయ్యి వికెట్లను తాకింది. రజత్ పటీదార్ అప్రమత్తమైనా బంతిని అడ్డుకునే అవకాశం లేకుండా పోయింది. దాంతో రజత్ పటీదార్ తీవ్ర నిరాశగా పెవిలియన్ చేరాడు. శ్రేయస్ అయ్యర్ వికెట్ అనంతరం ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పటీదార్.. యశస్వి జైస్వాల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 70 పరుగులు జోడించాడు.
ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ క్రీజులో సెట్ అయ్యాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్పిన్నర్లపై స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో ఎదురుదాడికి దిగాడు. కానీ దురదృష్టం వెంటాడటంతో పెవిలియన్ బాట పట్టాడు. రజత్ పటీదార్ ఔటైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పాపం రజత్ పటీదార్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. కెప్టెన్ రోహిత్ శర్మ(14), శుభ్‌మన్ గిల్(34), శ్రేయస్ అయ్యర్(27) వికెట్లు త్వరగా కోల్పోయినా.. యశస్వి జైస్వాల్ (256 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 179 బ్యాటింగ్) భారీ శతకంతో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. రజత్ పటీదార్‌తో పాటు అక్షర్ పటేల్(27)తో యశస్వీ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అక్షర్(27), కేఎస్ భరత్(17) ఔటైనా.. యశస్వి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.