For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: ఏం గుండెరా అది.. ఒక రోజు ముందే తుది జట్టు ప్రకటన!

ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ మరోసారి తన మార్క్ చూపెట్టాడు. భారత పర్యటనలోనే పరిమిత ఓవర్ల కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మెక్‌కల్లమ్.. ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా టాస్ పడే వరకు తుది జట్లను ప్రకటించరు.

పిచ్ కండిషన్స్.. టాస్ ఫలితాన్ని బట్టి చివరి నిమిషంలో కూడా తుది జట్టును మారుస్తుంటారు. కానీ దూకుడుకు మారు పేరైన బ్రెండన్ మెక్‌ కల్లమ్‌ ఒక రోజు ముందే ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌.. భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

IND vs ENG Fans Reactions After England name playing XI for Kolkata T20I

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా బుధవారం తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బరిలోకి దిగే ఇంగ్లండ్ తుది జట్టును ఒక రోజు ముందే ప్రకటించారు.

జోస్ బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ ఏడాది తర్వాత టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. అతను చివరగా 2023 డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆదిల్ రషీద్‌ను స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకున్నారు. యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్‌గా నియమించారు.

జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఆదిల్ రషీద్‌తో పాటు లియామ్ లివింగ్ స్టోన్ స్పిన్ బౌలింగ్ చేయనున్నాడు. ఒక రోజే ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించడంపై నెటిజన్లు బ్రెండన్ మెక్ కల్లమ్‌ను కొనియాడుతున్నారు.'ఏం గుండెరా అది'అని కామెంట్ చేస్తున్నారు.

2022లో ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రెండన్ మెక్‌కల్లమ్.. బజ్ బాల్‌తో టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఇంగ్లండ్‌కు సానుకూల ఫలితాలు రాకున్నా.. ఈ తరహా అప్రోచ్‌తో టెస్ట్ క్రికెట్‌కు క్రేజ్ పెరిగింది. గతేడాదే అతని కాంట్రాక్ట్ ముగిసింది. అయితే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.

అతని కాంట్రాక్ట్‌ను 2027 వరకు పొడిగించింది. అంతేకాకుండా వైట్‌బాల్ ఫార్మాట్ కోచింగ్ బాధ్యతలను కట్టబెట్టింది. దాంతో మెక్‌కల్లమ్ ఇంగ్లండ్‌కు పూర్తి స్థాయి కోచ్‌గా మారాడు. గతేడాది సెప్టెంబర్‌లోనే నియామకమైనా.. భారత పర్యటనతోనే పరిమిత ఓవర్ల కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.

భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెథెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

Story first published: Tuesday, January 21, 2025, 17:42 [IST]
Other articles published on Jan 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+