టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన అరంగేట్ర మ్యాచ్‌లో సత్తా చాటాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ధ్రువ్ జురెల్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సూపర్భ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. ఆల్‌టైమ్ గ్రేట్ ట్రేడ్ మార్క్ షాట్స్ అప్పర్ కట్, పుల్ షాట్స్‌తో భారీ సిక్సర్లు బాదాడు.
అశ్విన్‌తో కలిసి 8వ వికెట్‌కు 77 పరుగులు జోడించాడు. స్వేచ్చగా బ్యాటింగ్ చేసిన ధ్రువ్ జురెల్.. తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని లేట్ కట్ ఆడే ప్రయత్నం చేసిన ధ్రువ్ జురెల్.. సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ చేతిలో పడటంతో 4 పరుగుల దూరంలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు.

దాంతో అరంగేట్ర మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసి ఉంటే అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కేవాడు. ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకోవడంపై ఫ్యాన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పాపం ధ్రువ్ జురెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌తో 112), రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) శతకాలతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
రవిచంద్రన్ అశ్విన్(89 బంతుల్లో 6 ఫోర్లతో 37), ధ్రువ్ జురెల్(104 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జస్‌ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) సైతం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(4/114) నాలుగు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్‌లీ, జోరూట్ తలో వికెట్ పడగొట్టారు. రెహ్మాన్ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి.