IND vs ENG: కోహ్లీకి బదులుగా బ్యాటింగ్ వచ్చిన ప్రాంక్ స్టార్ జార్వో.. ఈడ్చిపాడేసిన సెక్యూరిటీ (వీడియో)

లీడ్స్: భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫేమస్ ప్రాంక్ స్టార్ జార్వో మళ్లీ కడుపుబ్బా నవ్వించాడు. ఏకంగా భారత్ తరఫున బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి దూసుకొచ్చాడు. స్టార్ ఓపెనర్, హాఫ్ సెంచరీ హీరో రోహిత్ శర్మ వివాదాస్పద రీతీలో ఔటవ్వగానే.. ప్యాడ్లు, హెల్మెట్ ధరించిన జార్వో.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి బదులు మైదానంలోకి దిగాడు. టీమిండియా జెర్సీ ధరించి ఉండటం.. అచ్చం బ్యాట్స్‌మన్ తరహాలో హెల్మెట్, ఫ్యాడ్స్‌ని కూడా వేసుకుని ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది ఏమరపాటులో ఉండిపోయారు. కానీ.. అతను భారత బ్యాట్స్‌మన్ కాదు.. జార్వో అని గుర్తించిన ఫీల్డ్ అంపైర్లు.. సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు. దాంతో.. జార్వోని క్రీజు నుంచి మైదానం వెలుపలికి సెక్యూరిటీ సిబ్బంది ఈడ్చి పారేశారు.
జార్వో.. భారత క్రికెటర్...
టీమిండియా తరఫున జార్వో ఆడేందుకు ఇలా మైదానంలోకి రావడం ఇది రెండోసారి. ఇటీవల లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత బౌలర్లు ఇంగ్లండ్ వికెట్ పడగొట్టేందుకు శ్రమిస్తున్న వేళ.. భారత్ జట్టు జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చిన జార్వో.. బౌలింగ్ చేసేందుకు కూడా రెడీ అయ్యాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకోగా.. జెర్సీపై ఉన్న బీసీసీఐ లోగోని వారికి చూపించిన జార్వో.. తాను భారత క్రికెటర్‌ని అంటూ వారితో వాదించాడు. కానీ.. అతన్ని అప్పట్లో సెక్యూరిటీ సిబ్బంది మైదానం వెలుపలికి బలవంతంగా తీసుకెళ్లారు. లార్డ్స్‌లో జార్వో వాదన విన్న సిరాజ్ మైదానంలోనే పడిపడి నవ్వాడు. కోహ్లీ.. అతని భాదేంటని ప్రశ్నించగా.. టీమిండియా తరఫున ఆడుతాడంటా! అని నవ్వుతూ చెప్పాడు.
బ్రహ్మానందం టైప్‌లో..
తాజా మూడో టెస్ట్‌లోనూ జార్వో హడావుడి చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా అతన్ని తీసుకెళ్తుండగా.. తాను నెం.4లో బ్యాటింగ్ చేస్తానని వారిని జార్వో రిక్వెస్ట్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మైదానంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం నవ్వుఆపుకోలేకపోయారు. తెలుగు ఫ్యాన్స్ అయితే జార్వోను చూస్తుంటే కమెడియన్ బ్రహ్మానందం గుర్తుకు వస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరేమో రోహిత్ శర్మ ఔట్ లింక్ పెడుతూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
జార్వో కాదు.. రోహిత్ శర్మ
థర్డ్ అంపైర్ నిర్ణయంపై రోహిత్ అసహనం వ్యక్తం చేస్తుంటూ సెక్యూరిటీ సిబ్బంది లాక్కెళ్తున్నారని ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది. భారత స్టార్ ప్లేయర్‌ను ఇంత అవమానిస్తారా? అని ఒకరంటే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ను కాపాడేది ఇతనొక్కడేనని మరొకరు కామెంట్ చేస్తున్నారు. 69 జెర్సీ నెంబర్ కలిగిన జార్వో గురించి యావత్ భారతం తెలుసుకోవాలనుకుంటుందని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేయడం జార్వోకు కొత్తేమి కాదు. గతంలో మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలో టెంట్ వేసుకొని పడుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా లార్డ్స్ టెస్ట్ సందర్భంగా వైరల్ అయ్యాయి. ఇంగ్లండ్‌లో జార్వో పనులు నడుస్తున్నాయని, భారత్‌లో అయితే మక్కెలు విరగ్గొట్టేవారని భారత అభిమానులు అంటున్నారు.

భారత్ నిలకడగా..
మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా దీటుగా ఆడుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలి పరువు తీసుకున్న కోహ్లీసే.. రెండో ఇన్నింగ్స్‌లో స్పూర్తిదాయక పోరాటం చేస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) రాణించగా, చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్ దక్కింది.
ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. ఆట నాలుగో రోజు పుజారా, కోహ్లీసుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతోపాటు ఇతర బ్యాట్స్‌మెన్ రహానే, జడేజా, పంత్ కూడా కదంతొక్కితే ఈ మ్యాచ్‌లో భారత్ కోలుకునే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications