IND vs ENG: అండర్సన్ ఇన్.. బెన్ ఫోక్స్ ఔట్.. ఒక రోజు ముందే జట్టును ప్రకటించిన ఇంగ్లండ్!

బర్మింగ్‌హామ్: భారత్‌తో శుక్రవారం నుంచి జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. మ్యాచ్‌కు 24 గంటల ముందు తమ ఫైనల్ ఎలెవన్ వివరాలు వెల్లడించింది. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ జట్టులోకి వచ్చాడు. దాంతో జామీ ఓవర్టన్ ఉద్వాసనకు గురయ్యాడు. ఇక కరోనా వైరస్ బారిన పడిన వికెట్ కీపర్ బెన్ ఫోక్స్.. ఈ మ్యాచ్‌కు దూరం కాగా అతని స్థానంలో సామ్ బిల్లింగ్స్ అవకాశం దక్కింది. గతేడాది కరోనా కారణంగా మిగిలిపోయిన ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే.
బెన్ ఫోక్స్ ఔట్..
న్యూజిలాండ్ ఇటీవల ముగిసిన సిరీస్‌లో తలపడిన జట్టునే దాదాపు ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ ఒక్కడే కరోనా కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఓపెనర్లుగా అలెక్స్ లీస్, జాక్ క్రాలీ ఎంపికవ్వగా.. ఓలీ పోప్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. మాజీ కెప్టెన్ జోరూట్ నాలుగో స్థానంలో రానుండగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. ఆరో స్థానంలో జానీ బెయిర్ స్టో ఆడనుండగా.. ఏడో స్థానంలో వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ బరిలోకి దిగనున్నాడు. ఏకైక స్పిన్నర్‌గా జాక్ లీచ్ ఆడనుండగా.. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మ్యాటీ పోట్స్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

డ్రా చేసుకున్నా..
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న చివరి మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ సొంతమవుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు టీమిండియా గెలవడం కష్టంగానే అనిపిస్తుంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసి జోరు మీదుంది. ఆ సిరీస్ గెలిచిన జట్టులో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ ఒక్కడే దూరమయ్యాడు. ఇక బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ టీమ్ కొత్తగా కనిపిస్తోంది. పైగా ఆ జట్టు మంచి మ్యాచ్ ప్రాక్టీస్‌తో ఉంది.

గెలవడం కష్టమే..
మరోవైపు భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2022 సీజన్ అనంతరం నేరుగా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టారు. కౌంటీ జట్టుతో ఓ సన్నాహక మ్యాచ్ ఆడారు. ఇక రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్‌తో జట్టుకు దూరం కాగా.. అతని స్థానంలో ఓపెనింగ్ చేసే బ్యాట్స్‌మన్ ఎవరో తెలియడం లేదు. దానికి తోడు గాల్లో కదిలే బంతులను భారత బ్యాటర్లు ఆడలేరు. స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్‌లపై భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి. ఈ పరిస్థితుల్లో భారత గెలవడం దేవుడెరుగు.. డ్రా చేసుకుంటే గొప్పని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌తో తలపడే ఇంగ్లండ్ జట్టు ఇదే:
అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్(కీపర్), జాక్ లీచ్, మ్యాటీ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications