Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Vs ENG: మూడో టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ పేసర్ ఔట్‌!!

IND vs ENG: England pacer Mark Wood ruled out of 3rd Test due to injury

లండ‌న్‌: లీడ్స్ వేదికగా టీమిండియాతో బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. భుజం గాయంతో ఇంగ్లండ్ స్టార్‌ పేసర్ మార్క్ వుడ్ మూడో టెస్ట్‌కు దూర‌మ‌య్యాడు. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆట‌లో మార్క్ వుడ్ గాయ‌ప‌డ్డాడు. మూడో టెస్ట్ సమయానికి అత‌డు కోలుకుంటాడ‌ని ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం ఆశించింది. అయితే వుడ్‌ పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌లేక‌పోవడంతో.. అతను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్‌ అండ్ వేల్స్ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

మరోసారి ఫిట్‌నెస్‌ టెస్ట్

మరోసారి ఫిట్‌నెస్‌ టెస్ట్

మార్క్‌ వుడ్‌ జట్టుతోనే ఉంటాడ‌ని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవ‌డంపై దృష్టిసారిస్తాడ‌ని ఈసీబీ వెల్లడించింది. మూడో టెస్ట్ అనంతరం అత‌నికి మరోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తామని, అప్పటికీ కోలుకోలేకపోతే సిరీస్‌ నుంచి తప్పిస్తామని ఈసీబీ తెలిపింది. మరోవైపు గాయాల కారణంగా ఇప్ప‌టికే స్టువర్ట్‌ బ్రాడ్‌, జోఫ్రా ఆర్చ‌ర్‌, క్రిస్‌ వోక్స్‌, బెన్ స్టోక్స్‌ లాంటి స్టార్‌ పేసర్ల సేవలను ఇంగ్లండ్ కోల్పోయింది. తాజాగా వుడ్‌ కూడా గాయపడడంతో ఇంగ్లండ్‌ జట్టుకు కష్టాలు రెట్టింపయ్యాయి. రెండో టెస్టులో వుడ్ రాణించిన విషయం తెలిసిందే.

ఓపెనర్‌గా హసీబ్ హమీద్

ఓపెనర్‌గా హసీబ్ హమీద్

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి లీడ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌లో భారత్‌తో అమీతుమీ తేల్చుకోనేందుకు ఇంగ్లండ్ సిద్దమవుతోంది. ఇప్పటికే తమ తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడిన ఆతిథ్య జట్టు.. తుది జట్టులో మార్పులు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లపై వేటు వేసి టీ20 స్పెషలిస్ట్‌ డేవిడ్ మలాన్‌ను తీసుకుంది.

గత రెండు టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్ డామ్ సిబ్లీ వేటుపడటంతో రోరీ బర్న్స్‌కు జతగా హసీబ్ హమీద్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో మలాన్ బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో జో రూట్ ఆడనున్నాడు.

IND vs ENG: 'విరాట్ కోహ్లీ మనలాంటి మనిషే.. తప్పులు చేయడం సహజమే! సెంచరీ కచ్చితంగా చేస్తాడు'

వుడ్ స్థానంలో సకీబ్ మహమూద్

వుడ్ స్థానంలో సకీబ్ మహమూద్

మిడిలార్డర్‌లో జానీ బెయిరిస్టో, జోస్ బట్లర్, మోయిన్ అలీ జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. లోయరార్డర్‌లో సామ్ కరన్, ఓలీ రాబిన్సన్ ఎలాగు బ్యాట్ ఝులిపించగలరు. జేమ్స్ అండర్సన్‌కు జతగా సామ్ కరన్, ఓలీ రాబిన్సన్ ఉంటారు. గాయంతో తప్పుకున్న మార్క్ వుడ్ స్థానంలో సకీబ్ మహమూద్ ఆడనున్నాడు. ఇదే జరిగితే మహమూద్ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడు. మొత్తానికి ఇంగ్లండ్ పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది.

ఇంగ్లండ్ తుది జట్టు (అంచనా)

ఇంగ్లండ్ తుది జట్టు (అంచనా)

రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిరిస్టో, జోస్ బట్లర్ (కీపర్), మొయిన్ అలీ, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, సకీబ్ మహమూద్, జేమ్స్ అండర్సన్.

Story first published: Monday, August 23, 2021, 17:36 [IST]
Other articles published on Aug 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+