IND vs ENG: 'విరాట్ కోహ్లీ మనలాంటి మనిషే.. తప్పులు చేయడం సహజమే! సెంచరీ కచ్చితంగా చేస్తాడు'

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఫరూక్ ఇంజనీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. కోహ్లీ కూడా మనలాంటి సాధారణ మనిషే అని, మానవులు ఎవరైనా తప్పులు చేస్తారన్నాడు. కోహ్లీ కొంత కాలంగా శతకం సాధించకపోవడంపై ఫరూక్ ఇంజనీర్ అలా వ్యాఖ్యానించాడు.
కోహ్లీ తన సుదీర్ఘ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు సాధించే కోహ్లీ.. గత 20 నెలలుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. టీ20, వన్డేల్లో మోస్తరుగా రాణిస్తున్నా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

బంగ్లాదేశ్‌పై చివరిసారిగా
విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా శతకం చేశాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. ఇటీవల ముగిసిన టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల ఆశలను విరాట్ వమ్ము చేశాడు. 2008లో క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన కోహ్లీ.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు. 2021లోనైనా శతకం సాధిస్తాడా లేదో చూడాలి.

మానవులు ఎవరైనా తప్పులు చేస్తారు
విరాట్ కోహ్లీ 20 నెలలుగా ఒక్క శతకం సాధించలేకపోయినా.. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఈ ఏడాది ఇప్పటివరకు ఐదు శతకాలు బాదాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి బ్యాటింగ్‌పై ఫరూక్ ఇంజనీర్ స్పందించాడు. 'విరాట్ కోహ్లీ లాంటి సత్తా ఉన్న ఆటగాడు బరిలోకి దిగిన ప్రతిసారీ శతకం సాధించాలని మనమంతా కోరుకుంటాం.
కానీ కోహ్లీ కూడా మనలాంటి సాధారణ వ్యక్తే. మానవులు ఎవరైనా తప్పులు చేస్తారు. అలాగే కోహ్లీ కూడా. అతడు శతకం సాధించకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో అదృష్టం కూడా కలిసి ఉంటుంది. కానీ దురదృష్టం కొద్దీ కోహ్లీ తరచూ ఔటైపోతున్నాడు' అని ఇంజనీర్ అన్నాడు.
విరాట్ కోహ్లీకి ఆ ముద్దుపేరు ఎలా వచ్చింది.. ఎవరు ఫేమస్ చేశారో తెలుసా?!!

కోహ్లీని అసలు నిందించను
'బంతి బ్యాట్ అంచులకు తాకడంతో విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోతున్నాడు. ఈ విషయంలో నేను కోహ్లీని అసలు నిందించను. ఎందుకంటే అతడింకా గొప్ప ఆటగాడే. ఇప్పటికీ 40-50 పరుగులు చేస్తున్నాడు. అతడో మేటి ఆటగాడు. సెంచరీ గురించి ఎలాంటి ఆందోళన వద్దు. త్వరలోనే మూడంకెల మార్క్ అందుకుంటాడు. ఇంగ్లండ్ పర్యటనలోనే కోహ్లీ సెంచరీ చేయాలని నేను కోరుకుంటున్నా' అని మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ ఆశించాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ గురించి మాట్లాడుతూ.. అతడు ప్రస్తుతం ప్రపంచంలోని మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడని కొనియాడాడు. జట్టుకు అవసరమైన రీతిలో అతడు నిలకడగా పరుగులు చేస్తున్నాడని చెప్పాడు. రూట్ బ్యాటింగ్ బాగుంటుందని ఇంజనీర్ పేర్కొన్నాడు.

దూకుడు కూడా నచ్చుతుంది
'ప్రత్యర్థులతో దూకుడుగా ఉండే విషయంలో నేను విరాట్ కోహ్లీని ఎంతో ఇష్టపడతాను. అతనో స్ఫూర్తిదాయక కెప్టెన్. ఎల్లప్పుడూ మైదానంలో చురుగ్గా ఉంటాడు. ఏ కెప్టెన్ అయినా అలాగే ఉండాలి. అయితే అది హద్దులు దాటకూడదు. లేకపోతే అంపైర్లు లేదా మ్యాచ్ రిఫరీలు కలుగజేసుకుంటే వివాదం పెద్దది అవుతుంది. అలాగే కోహ్లీ కొన్నిసార్లు తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కానీ నాకు అతని తీరు ఎంతో ముచ్చటేస్తుంది. అతనో మేటి సారథి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అతను' అంటూ ఇంజనీర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications