For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: టీమిండియా దరిద్రమో.. ఇంగ్లండ్ అదృష్టమో! 32 ఏళ్ల తర్వాత ఓపెనర్లు వంద కొట్టారు!

IND vs ENG: England Openers Breaks 32 Years Old Record Vs India In 5th Test

బర్మింగ్‌హామ్: టీమిండియా దరిద్రమో.. ఇంగ్లండ్ అదృష్టమో తెలియదు కానీ 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇంగ్లీష్ ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం అందించారు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ(46), అలెక్స్ లీస్(56 నాటౌట్) ఈ ఘనతను అందుకున్నారు. భారత్ విధించిన 378 పరుగుల భారీ లక్ష్యచేధనలో ఊహించని శుభారంభాన్ని అందించారు. టీ20 తరహా బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై విరుచుకుపడిన ఈ ద్వయం 119 బంతుల్లోనే సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసింది.

32 ఏళ్ల తర్వాత..

32 ఏళ్ల తర్వాత..

మహమ్మద్ సిరాజ్ వేసిన 20వ ఓవర్ ఐదో బంతికి జాక్ క్రాలీ సింగిల్ తీయడంతో ఈ ఇద్దరి మధ్య 100 పరుగుల భాగస్వామ్యం పూర్తి అయింది. సొంతగడ్డపై భారత్‌తో ఒక సిరీస్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు మూడు 100+ రన్స్ పార్టనర్‌షిప్ నమోదు చేయడం 1990 తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1990లో భారత్‌పై ఇలా ఇంగ్లండ్ ఓపెనర్లు ఒకే సిరీస్‌లో మూడు 100+ భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఇక భారత్‌పై 100 ప్లస్ భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జట్టు ఓపెనర్లుగా జాక్ క్రాలీ, అలెక్స్ లీస్ నిలిచారు. 1967/68లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెనర్లు 100+ భాగస్వామ్యం నమోదు చేయగా.. 1990, 2022లో ఇంగ్లండ్ ఓపెనర్లు ఈ ఫీట్ సాధించారు.

 2 పరుగులు 3 వికెట్లు

2 పరుగులు 3 వికెట్లు

అయితే బుమ్రా బౌలింగ్‌లో జాక్ క్రాలీ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. తొలి వికెట్‌కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో ఇంగ్లండ్ 107/1 స్కోర్‌తో టీ బ్రేక్ వెళ్లింది. ఇక మూడో సెషన్ ఆరంభంలోనే బుమ్రా.. ఓలిపోప్(0) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్‌తో ఇంగ్లండ్ గడ్డపై ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డు కెక్కాడు. ఈ క్రమంలో కపిల్ దేవ్(21), భువనేశ్వర్ (19)లను బుమ్రా(22) అధిగమించాడు. ఆ వెంటనే క్రీజులో సెట్ అయిన లీస్(56)ను జడేజా రన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ కష్టాల్లో కూరుకుపోయింది. రెండు పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది.

భారత్ 245 ఆలౌట్

భారత్ 245 ఆలౌట్

125/3 ఓవర్ నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు కుప్పకూలింది. బెన్ స్టోక్స్(4/33) అద్భుత బౌలింగ్‌తో భారత్ పతనాన్ని శాసించాడు. ఓవర్ నైట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా(66)భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమవ్వగా.. రిషభ్ పంత్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ ఇతర బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా(27), మహమ్మద్ షమీ(13), జస్‌ప్రీత్ బుమ్రా(7) చేతులెత్తేయడంతో భారత్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌‌కు తోడుగా స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పోట్స్ రెండేసి వికెట్లు తీయగా.. అండర్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ పడగొట్టారు.

 సంక్షిప్త స్కోర్లు..

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)

భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 15 ఓవర్లలో 70/0

Story first published: Monday, July 4, 2022, 21:19 [IST]
Other articles published on Jul 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+