For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: భారత 298/8 డిక్లేర్.. ఇంగ్లండ్ లక్ష్యం 272.. మొదలైన వికెట్ల పతనం!

IND vs ENG: England need 272 from a possible 60 overs to win at Lords

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 298/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆతిథ్య జట్టు ముందు 272 పరుగుల లక్ష్యం నమోదైంది. భారత టెయిలండర్లు మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్) అద్భుత పోరాటంతో భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించింది. ఈ ఇద్దరు తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 89 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. టెస్ట్‌ల్లో భారత్‌కు ఇదే 9వ వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 60 ఓవర్లలో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయాలి. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే వన్డే తరహా బ్యాటింగ్ చేయాలి.

పంత్ విఫలమైనా..

పంత్ విఫలమైనా..

అంతకుముందు 181/6 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓటమి నుంచి జట్టును గట్టెక్కిస్తాడనుకున్న రిషభ్ పంత్(22) తీవ్రంగా నిరాశపరిచాడు. బౌండరీతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన పంత్.. రాబిన్సన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేయబోయి ఎక్స్‌ట్రా బౌన్స్ కారణంగా కీపర్ చేతికి చిక్కాడు.

దాంతో భారత్ 194 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి మహమ్మద్ షమీ(4 బ్యాటింగ్) రాగా.. ఇషాంత్ శర్మ(12 బ్యాటింగ్) ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. రెండు బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ ఓలీ రాబిన్సన్ ఇషాంత్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకుండా పోయింది. దాంతో భారత్‌ ఇన్నింగ్స్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ బుమ్రా-షమీ అద్భుతంగా పోరాడారు.

సిక్సర్‌తో షమీ హాఫ్ సెంచరీ..

సిక్సర్‌తో షమీ హాఫ్ సెంచరీ..

ఇంగ్లండ్ బౌలర్లు రాకాసి బౌన్సర్లతో ఎదురుదాడికి దిగినా.. ధీటుగా బదులిచ్చారు. టాపార్డర్ బ్యాట్స్‌మన్ తరహాలో స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి సహనాన్ని పరీక్షించారు. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ బౌలర్లు మార్చినా.. ఫీల్డి సెటప్ జరిపినా.. వ్యూహం మార్చినా ఫలితం లేకపోయింది.

ఈ క్రమంలో 58 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో షమీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోయిన్ అలీ వేసిన 106 ఓవర్ తొలి బంతిని బౌండరీ తరలించిన షమీ.. ఆ మరుసటి బంతిని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో భారీ సిక్సర్‌గా మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షమీ హాఫ్ సెంచరీ పూర్తైన వెంటనే లార్డ్స్ బాల్కనీలోని భారత ఆటగాళ్లు స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందనలు తెలిపారు.

ఇంగ్లండ్ 1/2

ఇంగ్లండ్ 1/2

షమీకి ఇది కెరీర్‌లో రెండో హాఫ్ సెంచరీకాగా.. ఈ రెండు ఇంగ్లండ్ గడ్డపైనే సాధించడం గమనార్హం. 2014 పర్యటనలో షమీ మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. షమీ-బుమ్రా క్రీజులో అజేయంగా నిలవడంతో లంచ్ బ్రేక్ సమాయనికి భారత్ 108 ఓవర్లలో 8 వికెట్లకు 286 రన్స్ చేసింది. ఆ తర్వాత ఈ జోడీ 12 పరుగులు జోడించగానే భారత కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌గా ప్రకటించాడు. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి ఓవర్‌లోనే బుమ్రా.. ఓపెనర్ రోరీ బర్న్స్(0)ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.

Story first published: Monday, August 16, 2021, 19:51 [IST]
Other articles published on Aug 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+