Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: భారత్‌ను వీడనున్న ఇంగ్లండ్ టీమ్.. ఎందుకంటే?

వైజాగ్ టెస్ట్‌లో ఓటమిపాలైన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్‌ను వీడేందుకు సిద్దమైంది. వైజాగ్ టెస్ట్‌లో ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టు భారత్ వీడి అబుదాబి వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుండగా.. ఇరు జట్ల ఆటగాళ్లకు 10 రోజుల విశ్రాంతి లభించింది.

దాంతో ఈ సమయాన్ని అబుదాబిలో గడిపి మూడో టెస్ట్ సమయానికల్లా భారత్‌కు రావాలనుకుంటోంది. ఈ మేరకు ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. మూడో టెస్ట్‌కు రెండు రోజుల ముందు భారత్‌కు చేరుకుంటామని తెలిపింది. హైదరాబాద్ టెస్ట్‌లో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్.. వైజాగ్ టెస్ట్‌లో సమష్టిగా చెలరేగి 106 పరుగులతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.

IND vs ENG: England head back Abu Dhabi, to reunite before 3rd Test in Rajkot

ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఈ పర్యటనకు ముందు ఇంగ్లండ్ జట్టు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి అబుదాబిలో ప్రత్యేక క్యాంప్‌ నిర్వహించింది. భారత్ తరహా స్పిన్ పిచ్‌లను సిద్దం చేసుకొని ప్రాక్టీస్ చేసింది. ఈ సన్నాహకంతోనే హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది.

ముఖ్యంగా అనుభవంలేని ఇంగ్లండ్ స్పిన్నర్లు కూడా సత్తా చాటారు. ఈ క్రమంలోనే ఈ విశ్రాంతి సమయాన్ని మళ్లీ అక్కడ గడిపి ట్రాక్‌లోకి రావాలని ఇంగ్లండ్ భావిస్తోంది. రెండో టెస్ట్‌లో బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ, శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగగా.. బౌలింగ్‌లో బుమ్రా రివర్స్ స్వింగ్‌తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 399 పరుగుల లక్ష్యచేధనలో ఇంగ్లండ్ 292 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Tuesday, February 6, 2024, 20:16 [IST]
Other articles published on Feb 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+