
ఔట్ చేయడానికి చూడకుండా
ఐదో రోజు ఆటలో భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా ( 34 నాటౌట్), మొహ్మద్ షమీ (56 నాటౌట్) చెలరేగిన విషయం తెలిసిందే. ఒకవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూషిస్తున్నా.. మరోవైపు పేసర్లు బౌన్సర్లతో బయపెడుతున్నా అద్భుతంగా ఆడారు. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అయితే ఇంగ్లండ్ పేసర్లు బుమ్రా-షమీలను ఔట్ చేయడానికి చూడకుండా బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆ ప్రణాళిక కాస్త బెడిసికొట్టడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కింది. ఇంత జరుగుతున్నా.. మిస్టర్ పర్ఫెక్ట్ జో రూట్ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయాడు. దాంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు చెలరేగుతున్నాయి.
AFG Vs Pak: తాలిబన్ల ఎఫెక్ట్.. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ వన్డే సిరీస్ వాయిదా! నిరాశలో పీసీబీ!!

తీవ్ర విమర్శలు
లార్డ్స్‌లో ఐదో రోజు జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఇంగ్లండ్ జట్టు చేసిన తప్పులను సొంత జట్టు మాజీలే తీవ్రంగా తప్పుపట్టారు. నాసర్ హుస్సేన్ అయితే రూట్ కెప్టెన్సీని వేలెత్తిచూపాడు. కెప్టెన్సీ అనేది పాపులారిటీ కాదని తీవ్రంగా మండిపడ్డాడు. ఇక అభిమానుల సంగతి అయితే చెప్పక్కర్లేదు.
ట్వీట్లు, కామెంట్లతో పాటు మీమ్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జో రూట్ ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడో టెస్టులో తాము సరైన ఆట ఆడాలనుకుంటున్నామని, ప్రత్యర్థి జట్టుతో ఎలాంటి వివాదాలకు పోదల్చుకోవడంలేదని రూట్ చెప్పుకొచ్చాడు.

చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం
లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే తర్వాతి మ్యాచ్‌లో తాము నిజాయతీగా ఉండాలనుకుంటున్నామని జో రూట్ తెలిపాడు. వ్యక్తిగతంగా ఎంత నిక్కచ్చిగా ఉంటామో.. ఒక బృందంలోనూ అలాగే అత్యుత్తమ ఆట ఆడాలనుకుంటున్నామన్నాడు. 'గత టెస్టు నుంచి మేం చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. కొన్ని విషయాల్లో మరో విధంగా ఆడాల్సింది.
ఒక కెప్టెన్‌గా నేనూ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సిరీస్‌లో ఇంకా మూడు టెస్టులు ఆడాలి. అన్నింటిలో సరైన విధంగా ఆడాలని అనుకుంటున్నాం. అలాగే రెండో టెస్టు ఓటమి నుంచి చాలా త్వరగా పుంజుకోవాలని చూస్తున్నాం. భారత్ కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా' అని జో రూట్ పేర్కొన్నాడు.

మూడు మార్పులతో బరిలోకి
ఇంగ్లండ్ జట్టు మూడో టెస్టులో మూడు కీలక మార్పులతో బరిలోకి దిగనుందని జో రూట్ స్పష్టం చేశాడు. డామ్ సిబ్లీ బదులు జట్టులోకి డేవిడ్ మలన్ వస్తున్నాడని, అలాగే హసీబ్ హమీద్ ఓపెనర్‌గా ఆడనున్నాడని చెప్పాడు. ఫస్ట్ డౌన్‌లో మలాన్ బ్యాటింగ్ చేయనున్నాడట.
ఇక రెండో టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన మార్క్ వుడ్ భుజం గాయం కారణంగా దూరమయ్యాడని రూట్ తెలిపాడు. అతడి స్థానంలో సాకిబ్ మహమూద్ అరంగేట్రం చేయనున్నట్లు చెప్పాడు. హసీబ్ హమీద్, సాకిబ్ మహమూద్ ఇద్దరూ ఇంగ్లండ్ జట్టుకు ఉపయోగపడతారని కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications
