Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: రఫ్ఫాడించిన వరుణ్ చక్రవర్తీ.. తడబడిన ఇంగ్లండ్!

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ అసాధారణ ప్రదర్శన కొనసాగుతోంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో వరుణ్ చక్రవర్తీ (5/24) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది.

బెన్ డకెట్(28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. లియామ్ లివింగ్‌స్టోన్(24 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 43) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీతో పాటు హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

IND vs ENG England 171 9 After Varun Chakravarthy bags fifer In 3rd T20I

డకెట్ చెలరేగినా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఫిల్ సాల్ట్(5)మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి జోస్ బట్లర్ రాగా.. మరో ఓపెనర్ బెన్ డకెట్ దూకుడుగా ఆడాడు. మహమ్మద్ షమీ వేసిన మూడో ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన డకెట్.. హార్దిక్ పాండ్యా వేసిన మరుసటి ఓవర్‌లో హ్యాట్రిక్ బౌండరీలు కొట్టాడు.

సుందర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 15 పరుగులు పిండుకున్నాడు. దాంతో సూర్య.. వరుణ్ చక్రవర్తీని రంగంలోకి దింపి డకెట్ దూకుడుకు బ్రేక్ వేసాడు. దాంతో పవర్ ప్లేలో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది.

రఫ్ఫాడించిన వరుణ్ చక్రవర్తీ..
అనంతరం బట్లర్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ బాదాడు. అయితే ఈ జోడీని వరుణ్ చక్రవర్తీ విడదీసాడు. బట్లర్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి బ్రూక్ రాగా.. బెన్ డకెట్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని అక్షర్ పటేల్‌ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది.

లివింగ్ స్టోన్ భారీ సిక్సర్లతో చెలరేగినా.. మరో ఎండ్‌లో రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ వికెట్లు తీసారు. హ్యారీ బ్రూక్‌ను బిష్ణోయ్ ఔట్ చేయగా.. వరుణ్ చక్రవర్తీ తన మూడో ఓవర్‌లో జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్‌లను పెవిలియన్ చేర్చాడు. తన ఆఖరి ఓవర్‌లో బ్రైన్ కార్స్, జోఫ్రా ఆర్చర్‌లను పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

ఓవైపు వికెట్లు పడినా మరోవైపు లివింగ్ స్టోన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు బాదాడు.అయితే అతని దూకుడుకు హార్దిక్ పాండ్యా బ్రేక్ వేసాడు. ఊరించే బంతి సాయంతో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ మరో వికెట్ పడకుండా జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించారు.

Story first published: Tuesday, January 28, 2025, 20:46 [IST]
Other articles published on Jan 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+