Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్.. భారత అభిమానులకు గుడ్ న్యూస్!

IND vs ENG: ECB Changes Start Timing for Rescheduled Contest in Birmingham

న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కరోనా కారణంగా గతేడాది మిగిలిపోయిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జూలై 1 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్ట్‌లు జరగ్గా భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్ట్‌కు ముందు భారత జట్టులో కరోనా కేసులు నమోదవ్వడంతో ఆ మ్యాచ్‌ను రద్దు చేసి ఈ ఏడాదికి షెడ్యూల్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టి సన్నాహకాలు కూడా మొదలుపెట్టింది.

అరగంట ముందే మ్యాచ్..

అరగంట ముందే మ్యాచ్..

ఇక ఈ మ్యాచ్‌‌ను నిర్ణీత సమయం కన్నా ఓ అరగంట ముందే ప్రారంభించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నిర్ణయించింది. భారత అభిమానుల కొరకు మ్యాచ్‌ను అరగంట ముందుగా ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. వాస్తవానికి జూలై 1న టీమిండియా- ఇంగ్లండ్‌ టెస్టు భారత కాలామాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకి( ఇంగ్లండ్‌​ లోకల్‌ టైం ఉదయం 11 గంటలు) ప్రారంభం కావాల్సి ఉంది.

ఫ్యాన్స్ ఖుషీ..

ఫ్యాన్స్ ఖుషీ..

తాజాగా ఈసీబీ మ్యాచ్‌ సమయాన్ని అరగంట ముందుకు మార్చింది. దీని ప్రకారం మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటలకు(లోకల్‌ టైం ఉదయం 10:30 గంటలు) ప్రారంభమై రాత్రి 10 లేదా 10:30 గంటల వరకు జరగనుంది. దాంతో అర్థరాత్రి వరకు వేచి చూడాల్సిన అవసరం అభిమానులకు తప్పనుంది. ఉదయం ఆఫీసులకు ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈసీబీ నిర్ణయాన్ని అభిమానులు స్వాగతిస్తున్నారు.

ఐదు రోజుల పాటు జరగనున్న టెస్టు మ్యాచ్‌లో రోజు 90 ఓవర్లు ఆట సాధ్యమయ్యేలా ఈసీబీ ప్రణాళికలు రచించింది. ఇక టెస్టు మ్యాచ్‌ ముగిసిన తర్వాత జూలై 7, 9,10 తేదీల్లో మూడు టీ20లు.. ఆ తర్వాత జూలై 12,14, 17వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి.

రోహిత్‌కు కరోనా..

రోహిత్‌కు కరోనా..

కాగా రోహిత్‌ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆదివారం ఉదయం బీసీసీఐ ప్రకటించింది. శనివారం నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో అతడికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఆదివారం తెల్లవారుజామున ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం అతను టీమ్‌ బస చేసిన హోటల్‌లోనే ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఇక లీసెస్టర్‌ జట్టుతో జరుగుతోన్న వార్మప్‌ మ్యాచ్‌లో గురువారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసి 25 పరుగులు చేశాడు. కానీ, శనివారం రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా బ్యాటింగ్‌కు రాలేదు. ఈ క్రమంలోనే రోహిత్‌కు పాజిటివ్‌గా తేలడంతో ఇరు జట్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.

Story first published: Sunday, June 26, 2022, 13:27 [IST]
Other articles published on Jun 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+