Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్ ఎప్పుడైన రావచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన దినేశ్ కార్తీక్!

టీమిండియా అభిమానులకు దినేశ్ కార్తీక్ గుడ్‌ న్యూస్ చెప్పాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీతో ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ నుంచి వైదొలిగిన రవిచంద్రన్ అశ్విన్.. ఏ సమయంలోనైనా రావచ్చని కార్తీక్ తెలిపాడు. వచ్చి రావడంతోనే నేరుగా బౌలింగ్ చేసేలా అంపైర్ల అనుమతి తీసుకున్నాడని మూడో రోజు ఆట సందర్భంగా కార్తీక్ తమ కామెంట్రీలో చెప్పాడు.

'రవిచంద్రన్ అశ్విన్ ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఎప్పుడైనా వచ్చి బౌలింగ్ చేయవచ్చు. అలా వచ్చి రావడంతోనే బౌలింగ్ చేసేలా అతనికి అంపైర్ల అనుమతి ఇచ్చారు.'అని కార్తీక్ తెలిపాడు. కనీసం ఐదో రోజు ఆటలోనైనా అశ్విన్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

IND vs ENG: Dinesh Karthik says R Ashwin to ‘come back and bowl straightaway’ in Rajkot Test

అశ్విన్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో అశ్విన్ జట్టును వీడి చెన్నైకి వెళ్లాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సైతం ధృవీకరించింది. ఈ కఠిన కాలంలో అశ్విన్‌కు అండగా ఉంటామని, అతని వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇవ్వాలని మీడియా, అభిమానులకు సూచించింది. అశ్విన్ వెళ్లిపోవడంతో టీమిండియా నలుగురు బౌలర్లతోనే బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10 మంది ప్లేయర్లు, ఓ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించాల్సి ఉంటుంది.

అయితే అశ్విన్ స్థానంలో మరో ఆటగాడిని ఆడించే అవకాశం ఉందని, ప్రత్యర్థి కెప్టెన్ అంగీకరిస్తే అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను ఆడించవచ్చని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. అయితే ఆ తర్వాత గతేడాది ప్లేయర్ రిప్లేస్ మెంట్ రూల్స్ మార్చారని, ఆట ప్రారంభానికి ముందే రిప్లేస్‌మెంట్‌కు అవకాశం ఉందని తెలిపాడు. అందుకే పాత ట్వీట్‌లను తొలగించానని చెప్పాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే 207/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ధాటికి ఇంగ్లండ్ తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో చెత్త షాట్‌తో జోరూట్.. వెనుదిరగ్గా.. కుల్దీప్ స్పిన్ ధాటికి బెయిర్ స్టో(0), బెన్ డక్కెట్(153) పెవిలియన్ బాట పట్టారు.

దాంతో ఇంగ్లండ్ 290/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. క్రీజులో బెన్ ఫోక్స్(6 బ్యాటింగ్)తో పాటు బెన్ స్టోక్స్(39 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌‌లో 445 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌తో 112), రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) శతకాలతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

Story first published: Saturday, February 17, 2024, 12:10 [IST]
Other articles published on Feb 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+