
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ ఘనంగా ప్రారంభించింది. బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో మన పేసర్లు చెలరేగి ప్రత్యర్థిని కుప్పకూల్చారు. భారత బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ మొదటి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జో రూట్ (108 బంతుల్లో 11 ఫోర్లతో 64) మాత్రమే పట్టుదల ప్రదర్శించి హాఫ్ సెంచరీ సాధించగా, మిగతావారంతా విఫలమయ్యారు. 45 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 7 వికెట్లు కోల్పోవడం విశేషం. జస్‌ప్రీత్ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా... మహమ్మద్ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. శార్దూల్‌కు రెండు, సిరాజ్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (9 నాటౌట్), కేఎల్ రాహుల్ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు వాతావరణం భారత్‌కు కలిసొచ్చింది. మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో పాటు చల్లని గాలులు వీచడంతో భారత్ పేసర్లు చెలరేగారు. ఇక రెండో రోజు నాటింగ్‌హామ్ వెదర్ ఫోర్‌కాస్ట్ పరిశీలిస్తే కోహ్లీసేనకు ఫేవర్‌గా ఉంది. బుధవారం అక్కడ వర్షం పడే అవకాశం ఏం లేదు. అంతేకాకుండా గాలులు వీచడం, మబ్బులు కమ్మేయడం వంటివి కూడా తొలి రోజు కంటే తక్కువగా ఉండనున్నాయి.
అదే జరిగితే కోహ్లీసేనకు బ్యాటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆడుతూ పాడుతూ స్కోర్ బోర్డు పరుగెత్తించవచ్చు. పిచ్ విషయానికి వస్తే తొలి రోజు మాదిరే ఉండనుంది. జోరూట్‌లా పట్టుదలతో బ్యాటింగ్ చేస్తే బ్యాటింగ్ చేయవచ్చు. పిచ్ వల్ల ఇంగ్లండ్ బౌలర్లు ఇబ్బంది పడినట్లు అనిపించలేదు. రెండో రోజు కూడా అలానే ఉండనుంది. ఇక శుక్ర, శనివారాల్లో మాత్రం అక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు నాటింగ్‌హామ్ వెదర్ ఫోర్‌కాస్ట్ తెలుస్తోంది. ఉరుముల మెరుపులతో భారీ వర్షాలు పడుతాయని ఎల్లో వార్నింగ్ కూడా చూపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు భారత్ తొలి రోజు మాదిరే రెండో రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించాల్సిన అవసరం ఉంది.