Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: క్రిస్ వోక్స్ స్టన్నింగ్ డెలివరీ.. బిత్తర పోయిన తెలుగోడు!(వీడియో)

తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి.. ఇంగ్లండ్ పర్యటనను పేలవంగా ప్రారంభించాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అవకాశం అందుకున్న ఈ టీమిండియా పేస్ ఆల్‌రౌండర్.. తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమయ్యాడు. బుధవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌‌లో 6 బంతులాడి ఒకే ఒక్క పరుగు చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. క్రిస్ వోక్స్ స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రిస్ వోక్స్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నాడు. ఈ స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయిన నితీష్ కుమార్ రెడ్డి నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?

తొలి రోజు ఆట ఆఖరి సెషన్‌లో క్రిస్ వోక్స్ వేసిన 62వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని క్రిస్ వోక్స్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో వేసాడు. బంతి ఔట్ స్వింగ్ అవుతుందని పొరబడిన నితీష్ కుమార్ రెడ్డి ఆడకుండా బ్యాట్ పైకెత్తి వదిలేసాడు. కానీ ఇన్ స్వింగ్ అయిన బంతి ఆఫ్ స్టంప్‌ బెయిల్స్‌ను లేపేసింది. దాంతో నితీష్ కుమార్ రెడ్డి బిత్తరపోయాడు. బంతి అలా ఎలా స్వింగ్ అయ్యిందా? అని ఆశ్చర్యపోయాడు. ఈ ఓవర్ మూడో బంతిని ఇలానే నాలుగో స్టంప్‌లో వోక్స్ వేయగా.. నితీష్ వదిలేసాడు. అయితే ఐదో బంతిని వోక్స్ తెలివిగా సీమ్‌తో హిట్ చేసి స్వింగ్ చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టలేకపోయిన నితీష్.. బంతిని వదిలేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ వైఫల్యం నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శార్దూల్ ఠాకూర్ ఆడటం లేదని అవకాశం ఇస్తే.. ఇంత దారుణంగా విఫలమవుతావా? అని ప్రశ్నిస్తున్నారు.

IND vs ENG Chris Woakes Bowls Nitish Reddy After Costly Misjudgment in 2nd Test

శుభ్‌మన్ గిల్ పోరాటం..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 211 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(2) విఫలమైనా.. కరుణ్ నాయర్(31)తో కలిసి యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) జట్టును ఆదుకున్నాడు. రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించిన జైస్వాల్.. మూడో వికెట్‌తో 66 పరుగుల భాగస్వామ్యం అందించాడు. సెంచరీ దిశగా సాగిన అతన్ని బెన్ స్టోక్స్ ఔట్ చేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో రిషభ్ పంత్(25) ఔటవ్వగా.. ఆ మరుసటి ఓవర్‌లోనే నితీష్ కుమార్ రెడ్డి(1) పెవిలియన్ చేరాడు. జడేజాతో కలిసి శుభ్‌మన్ గిల్(77 బ్యాటింగ్) పోరాడుతున్నాడు. ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Wednesday, July 2, 2025, 22:08 [IST]
Other articles published on Jul 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+