టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో బుమ్రా ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగతా బౌలర్లంతా విఫలమైన ఫ్లాట్ వికెట్‌పై వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే బుమ్రా టీమిండియా కోహినూర్ అని ఒకరంటే.. వరల్డ్ బెస్ట్ పేసరని మరొకరు ప్రశంసించారు. భారత దిగ్గజ పేసర్ కపిల్ దేవ్ కంటే కూడా బుమ్రా అత్యుత్తమ పేసర్ అని కొనియాడారు. కానీ టీమిండియా వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు.
బుమ్రాలో ప్రత్యేకమైన బౌలింగ్ నైపుణ్యం ఉన్నప్పటికీ.. సీమ్ పొజిషన్ విషయంలో మహమ్మద్ షమీనే అత్యుత్తమమని చెప్పాడు. షమీ సీమ్ పొజిషన్‌కు బుమ్రా దగ్గరకు కూడా రాలేడని తెలిపాడు. కానీ షమీ లేజీ బౌలరని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోలేక జట్టుకు దూరమయ్యాడని అభిప్రాయపడ్డాడు. మహమ్మద్ షమీ 64 టెస్ట్ మ్యాచ్‌ల్లో 229 వికెట్లు పడగొట్టాడు. సీమ్ పొజిషన్‌తో పాటు రివర్స్ స్వింగ్‌ను షమీ అద్భుతంగా రాబడుతాడని చెప్పాడు.

'బుమ్రా ప్రతిభావంతుడు. ప్రత్యేకమైన బౌలర్. కానీ సీమ్ పొజిషన్ విజయానికి వస్తే.. భారత్‌లో షమీని అధిగమించే బౌలర్ లేడు. కానీ షమీ కాస్త లేజీ. ఫిట్‌నెస్‌పై అతను మరింత ఫోకస్ పెట్టాలి. ఇదే విషయాన్ని ఒకసారి నేను అతనికి చెప్పాను. మరింత వేగంగా బౌలింగ్ చేసేందుకు ఫిట్‌గా మారాలని సూచించాను. ఇప్పటికే తాను వేగంగా బౌలింగ్ చేస్తున్నానని సమాధానం చెప్పాడు. షమీ రివర్స్ స్వింగ్‌ను కూడా అద్భుతంగా రాబడుతాడు.' అని చతేశ్వర్ పుజారా చెప్పుకొచ్చాడు.
2023 వన్డే ప్రపంచకప్ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన మహమ్మద్ షమీ 14 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో షమీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున దారుణంగా విఫలమయ్యాడు. టెస్ట్ మ్యాచ్‌లకు కావాల్సిన ఫిట్‌నెస్‌ను షమీ సాధించలేకపోయాడు. దాంతో ఇంగ్లండ్ పర్యటనకు షమీని బీసీసీఐ ఎంపిక చేయలేదు. జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు ఈ పర్యటనకు ఎంపికయ్యారు. కానీ బుమ్రాకు అండగా మరో ఎండ్‌లో రాణించలేకపోతున్నారు.