IND vs ENG: చతేశ్వర పుజారా చెత్త రికార్డు.. 12 సార్లు అతని బౌలింగ్‌లోనే ఔట్!

బర్మింగ్‌హామ్: టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన పుజారా(13) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ గడ్డపై కౌంటీ క్రికెట్‌లో డబుల్ సెంచరీలతో చెలరేగిన పుజారా.. అసలు మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగిన పుజారా చెత్త రికార్డు నమోదు చేశాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో అత్యధికసార్లు ఔటైన బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టకున్నాడు.

మొత్తం 12 సార్లు ఔట్..
తాజా ఇన్నింగ్స్‌తో కలుపుకొని పూజారా ఇప్పటి వరకు 12 సార్లు అండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. గతేడాది జరిగిన ఇదే టెస్టు సిరీస్‌లో అండర్సన్ స్వింగ్ బంతులు ఆడలేక మొదటి, రెండు, నాలుగో టెస్టులో( రెండుసార్లు) వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పూజారా బలహీనతను ఆసరాగా చేసుకొని అండర్సన్ మరోసారి అలాంటి బంతులనే సంధించి ఐదో టెస్టులోనూ ఫలితం రాబట్టాడు.

రెండో ఇన్నింగ్స్‌లోనైనా..
మొత్తంగా ఈ సిరీస్‌లో 4,9,1,4,13 పరుగుల వద్ద అండర్సన్ బౌలింగ్‌లోనే పుజారా ఐదు సార్లు ఔటవ్వడం గమనార్హం. ఇక ఈ ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనైనా పూజారా జిమ్మికి చిక్కకుండా ఉంటాడేమో చూడాలి. అండర్సన్ టెస్టుల్లో అత్యధిక సార్లు ఔట్ చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో పూజారా (12) టాప్‌లో ఉండగా.. పీటర్ పిడిల్ (11), డేవిడ్ వార్నర్ (10) తర్వాతి స్థానంలో నిలిచారు.

కౌంటీ ప్రదర్శనతో రీఎంట్రీ..
వాస్తవానికి ఈ మ్యాచ్‌కు ముందు పుజారా భారత జట్టులో చోటు కోల్పోయాడు. ఈ సిరీస్‌తో పాటు సౌతాఫ్రికా పర్యటనలోనూ దారుణంగా విఫలమవడంతో శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌కు అతన్ని భారత సెలెక్టర్లు పక్కనపెట్టారు. అయితే ఐపీఎల్ 2022 సీజన్ సమయంలో కౌంటీ క్రికెట్ ఆడిన పుజారా డబుల్ సెంచరీలతో మెరిసి మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ ఆ జోరును మాత్రం కొనసాగించలేకపోయాడు. స్వింగ్ బాల్స్‌కు తీవ్రంగా తడబడి పెవిలియన్ చేరాడు.

98 పరుగులకే 5 వికెట్లు..
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పుజారాతో పాటు శుభ్‌మన్ గిల్(17), హనుమ విహారి(20), విరాట్ కోహ్లీ(11), శ్రేయస్ అయ్యర్(15) తీవ్రంగా నిరాశపరిచాడు. అండర్సన్‌కు అండగా యువ పేసర్ మ్యాటీ పోట్స్ చెలరేగాడు. దాంతో 109/5 స్కోర్ వద్ద భారత్ టీ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం ఆట ప్రారంభమవ్వగా.. రిషభ్ పంత్, రవీంద్ర జడేజా నిలకడగా ఆడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications