For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: ఇంగ్లండ్ తొండాట.. బాల్ టాంపరింగ్‌ చేస్తూ కెమెరాకు చిక్కిన పేసర్!

భారత్‌తో నాలుగో టెస్ట్‌లో విజయం కోసం ఇంగ్లండ్ చేయని ప్రయత్నం చేయలేదు. ఆఖరి రోజు ఆటలో భారత బ్యాటర్లను ఔట్ చేసేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్ని విధాల ప్రయత్నించాడు. తన వద్ద ఉన్న అన్ని వ్యూహాలను అమలు చేశాడు. పదే పదే బౌలర్లను, ఫీల్డ్ సెటప్‌ను మార్చాడు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. భారత బ్యాటర్లను రెచ్చగొట్టేలా నోటికి కూడా పని చెప్పాడు. స్లెడ్జింగ్‌తో కవ్వించాడు. అయినా భారత ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఏకాగ్రత కోల్పోకుండా ఓపికగా బ్యాటింగ్ చేశారు.

జిడ్డు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. దాంతో విసిగిన ఇంగ్లండ్ ఆటగాళ్లు తొండాటకు కూడా ప్రయత్నించారు. బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్.. బంతిని కాలి కిందేసి తొక్కడం కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్రికెట్‌లో బాల్ టాంపరింగ్ పెద్ద నేరం. బంతి ఆకారాన్ని దెబ్బతీసి కొత్త బంతిని అడగడం లేదా, స్వింగ్‌కు అనుకూలించేలా బంతిని మార్చడం వంటివి ఆటగాళ్లు చేస్తుంటారు.

IND vs ENG Caught on Camera England s Brydon Carse Under Scrutiny for Alleged Ball Tampering in 4th Test vs India

గతంలో ఇలా బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన ఆటగాళ్లు ఐసీసీ నుంచి కఠిన శిక్షలు ఎదుర్కొన్నారు. అంపైర్లు కూడా బాల్ టాంపరింగ్ చేయకుండా ఆటగాళ్లపై ఓ డేగ కన్ను వేస్తారు. ఇలాంటి ఘటనలు జరగవద్దనే ఆట ఆగిన ప్రతీసారి అంపైర్లు బంతిని అడిగి మరీ తీసుకుంటారు. ఆటగాళ్లు కూడా ఓవర్ పూర్తయిన వెంటనే అంపైర్‌కు బంతిని అందిస్తారు.

ఐసీసీ రూల్స్ ప్రకారం బంతి ఆకారం దెబ్బతీయడం పెద్ద నేరం. టవల్‌తో, ఉమ్మి, చెమటతో బంతిని పాలిష్ చేయవచ్చు. కానీ ఇతర వస్తువులతో బంతిని పాలిష్ చేయడం, ఆకారం దెబ్బతీయడం వంటివి చేయకూడదు. చేతి గోళ్లతో గీకడం, కాళ్ల కిందేసి తొక్కడం కూడా టాంపరింగ్‌ కిందకే వస్తుంది. బాల్ ట్యాంపరింగ్ అనేది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 3 నేరంగా పరిగణిస్తారు. ఈ నేరం కింద కనిష్టంగా 6 టెస్ట్ మ్యాచ్‌లు, 12 వన్డే మ్యాచ్‌లు నిషేధం విధిస్తారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్మిత్ బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించి రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నారు. బ్రైడన్ కార్స్‌పై కూడా నిషేధం విధించాలని టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌ను టీమిండియా డ్రా చేసుకుంది. రవీంద్ర జడేజా(185 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(206 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 101 నాటౌట్) అజేయ శతకాలతో ఓటమి నుంచి గట్టెక్కించారు.

Story first published: Monday, July 28, 2025, 12:17 [IST]
Other articles published on Jul 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+