IND vs ENG: కొండంత లక్ష్యం.. ఇంగ్లండ్ శుభారంభం! నాలుగో రోజు ఇరు జట్ల హవా!

ఓవల్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. నాలుగో రోజు ఆటలో ఇరు జట్లు జోరు కనబర్చాయి. 367 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆదివారం ఆట ముగిసేసమయానికి 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. క్రీజులో రోరీ బర్న్స్(31 బ్యాటింగ్), హసీబ్ హమీద్(43 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 291 పరుగుల దూరంలో ఉంది. ఇక అంతకు ముందు 270/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌటైంది.
శార్దూల్ ఠాకూర్(60), రిషభ్ పంత్(50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఉమేశ్ యాదవ్(25), జస్‌ప్రీత్ బుమ్రా(24) విలువైన పరుగులు జోడించారు. మూడో రోజు ఆటలో రోహిత్ శర్మ అద్వితీయ సెంచరీ (127) చేయగా, చతేశ్వర్ పుజారా (61) అర్ధ శతకం సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టగా... ఓలీ రాబిన్సన్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు తీశారు.

ఫస్ట్ సెషన్‌లోనే మూడు వికెట్లు..
ఇక నాలుగో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లోనే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు రవీంద్ర జడేజా(17)8 పరుగులు జత చేయగా.. రహానే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీ.. మొయిన్ అలీ బౌలింగ్‌లో స్లిప్‌లో దొరికి పోయాడు. దాంతో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లకు 329 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ అనంతరం రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ టీమిండియా భారీ స్కోర్‌కు బాటలు వేసారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఈ ద్వయం.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది.

శార్దూల్, పంత్ జోరు..
ఈ క్రమంలో శార్దూల్ 65 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అతనికి ఈ మ్యాచ్‌లో రెండో హాఫ్ సెంచరీ. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో(57) టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌కు బాటలు వేసాడు. అదే జోరును సెకండ్ ఇన్నింగ్స్‌లో కొనసాగించాడు. ఆ వెంటనే రిషభ్ పంత్ సైతం 105 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేసి ఫామ్ అందుకున్నాడు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. చివరకు బంతిని అందుకున్న కెప్టెన్ జోరూట్.. శార్దూల్‌ను ఔట్ చేసి ఏడో వికెట్‌కు నమోదైన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.

నిలకడగా ఇంగ్లండ్..
ఆ మరుసటి ఓవర్‌లోనే అలీకి పంత్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగుస్తుందని అంతా భావించారు. కానీ ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా నిలకడగా బ్యాటింగ్ చేసి కీలక పరుగులు జత చేశారు. బుమ్రాను క్రిస్ వోక్స్, ఉమేశ్‌ను ఓవర్టన్ ఔట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 466 పరుగులకు ముగిసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ మంచి శుభారంభాన్ని అందించారు. భారత బౌలర్లను సమర్థవంతా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. వికెట్ కోసం కోహ్లీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ జోడీ అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికే తొలి వికెట్ 77 పరుగుల భాగస్వామ్యంతో అజేయంగా నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications