ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తొడకండరాల గాయంతో రవీంద్ర జడేజా, కుడి తొడ నొప్పితో కేఎల్ రాహుల్ రెండో టెస్ట్‌కు దూరమయ్యారని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనను విడదల చేసింది.
ఈ ఇద్దరిని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ ఇద్దరి స్థానాల్లో అజిత్ అగార్కర్ సారథ్యంలోని మెన్స్ సెలెక్షన్ కమిటీ సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేసింది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ భారత్-ఏ తరఫున ఇంగ్లండ్-ఏతో అనధికారిక టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. భారత జట్టుకు ఎంపికైన ఆవేశ్ ఖాన్.. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అతని సేవలు అవసరమైతే.. భారత జట్టుతో చేరుతాడు.

సర్ఫరాజ్ ఖాన్ తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. గత రెండు-మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా రాణిస్తున్నాడు. సెంచరీల మోత మోగించినా అతన్ని భారత సెలెక్టర్లు పట్టించుకోలేదు. కేఎల్ రాహుల్ గాయపడటంతో అతనికి భారత జట్టు పిలుపు దక్కింది.
జట్టులోకి వచ్చినా.. తుది జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడించే అవకాశం లేదు. అతనికి రజత్ పటీదార్‌తో పోటీ నెలకొనుంది. వాషింగ్టన్ సుందర్ రీఎంట్రీతో కుల్దీప్ యాదవ్‌కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. వైజాగ్ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 2) రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 28 పరుగుల తేడాతో ఓడిన టీమిండియాకు స్టార్ ప్లేయర్లు దూరమవ్వడం ఎదురుదెబ్బే. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉన్నారు.
రెండో టెస్ట్‌కు భారత్ రివైజ్డ్ టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్.