Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. నోరెళ్లబెట్టిన బెన్ స్టోక్స్(వీడియో)

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సంచలన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించాడు.

ఇన్‌స్వింగర్, ఔట్‌స్వింగర్స్‌తో పాటు బుల్టెట్ యార్కర్లతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధిస్తూ బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపించడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు అయోమయానికి గురయ్యారు.

బుమ్రా బుల్లెట్ యార్కర్‌కు ఓలీపోప్ క్లీన్ బౌల్డ్ కాగా.. స్టన్నింగ్ స్వింగర్లకు జోరూట్, జానీ బెయిర్ స్టో క్యాచ్ఔట్‌గా వెనుదిరిగారు. ఇక నిలకడగా ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన బెన్ స్టోక్స్ సైతం బుమ్రా ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

IND vs ENG: Ben Stokes Reaction After Jasprit Bumrah Takes His Wicket In Vizag Test Goes Viral

ఈ స్టన్నింగ్ డెలివరీకి బెన్ స్టోక్స్ నోరెళ్లబెట్టాడు. బ్యాట్‌ను కిందపడేసి.. ఇలాంటి బంతులను ఎలా ఆడాలి? అంటూ బుమ్రాను ప్రశంసించాడు. ఈ సిరీస్‌లో బుమ్రా బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ క్లీన్ బౌల్డ్ అవ్వడం రెండోసారి. హైదరాబాద్ టెస్ట్‌లోనూ బుమ్రా బౌలింగ్‌లోనే బెన్ స్టోక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తాజా వికెట్‌తో బుమ్రా టెస్ట్‌ల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గా.. రెండో ఆసియా ప్లేయర్‌గా బుమ్రా చరిత్రకెక్కాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్‌ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ మరుసటి ఓవర్‌లోనే టామ్ హార్ట్‌లీ(21)ని బుమ్రా స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

బుమ్రా ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.3 ఓవర్లలో 253 పరుగులకు కుప్పకూలింది. జాక్ క్రాలీ(78 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బెన్ స్టోక్స్(47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

భారత బౌలర్లలో బుమ్రా(6/45) 6 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసాడు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 209) ఒక్కడే డబుల్ సెంచరీ‌తో రాణించాడు.

ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/47), షోయబ్ బషీర్(3/138), రెహాన్ అహ్మద్(3/65) మూడేసి వికెట్లు తీసాడు. టామ్ హార్ట్‌లీకి ఓ వికెట్ దక్కింది. భారత్‌కు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

Story first published: Saturday, February 3, 2024, 16:22 [IST]
Other articles published on Feb 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+