Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: టీమిండియా తొండాట.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు! (వీడియో)

భారత్‌తో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జాక్ క్రాలీ ఔటైన తీరు వివాదాస్పదమైంది. సాంకేతిక తప్పిదం కారణంగా తమ బ్యాటర్ జాక్ క్రాలీ ఔటయ్యాడని ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ ఆరోపించాడు. డీఆర్‌ఎస్ బాల్ ట్రాకింగ్‌లో వికెట్లను బంతి హిట్ అయినట్లు తప్పుగా చూపించారని తెలిపాడు. జాక్ క్రాలీ ఔటైనప్పుడు నాన్‌స్ట్రైకర్‌గా తానే ఉన్నానని, బంతి లెగ్ స్టంప్ పిచ్ అయ్యిందని, కానీ బాల్ ట్రాకింగ్‌లో వికెట్లను తాకినట్లు తప్పుగా చూపించారని అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో భారత్ తొండాట ఆడిందని, టెక్నాలజీని తమకు అనుగుణంగా మ్యానుపులేట్ చేసిందని ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తగిన ఆధారాలతో భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 106 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో హైదరాబాద్ టెస్ట్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

IND vs ENG: Ben Stokes blames technology after Zak Crawleys dismissal in Vizag Test

399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 292 పరుగులకు కుప్పకూలింది. జాక్ క్రాలీ(132 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 73) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జాక్ క్రాలీ ఐదో వికెట్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్ప కూలింది.

కుల్దీప్ యాదవ్ వేసిన 42 ఓవర్ చివరి బంతిని లెగ్ సైడ్ ఆడే క్రమంలో జాక్ క్రాలీ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. భారత ఆటగాళ్లు రివ్యూ తీసుకోగా.. బాల్ ట్రాకింగ్‌లో వికెట్లను హిట్ చేసినట్లు తేలింది. దాంతో జాక్ క్రాలీ పెవిలియన్ చేరాడు. అయితే బంతి లెగ్ స్టంప్ పిచ్ అయినట్లు స్పష్టంగా వీడియోలో కనబడుతుంది.

దాంతోనే ఈ వికెట్ విషయంలో టెక్నాలజీ పరంగా తప్పిదం జరిగిందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ వికెట్ విషయంపై మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన బెన్ స్టోక్స్.. ఘోర తప్పిదం జరిగిందని ఆరోపించాడు అయితే. ఈ తప్పుడు నిర్ణయం కారణంగా తాము ఓడిపోలేదని స్పష్టం చేశాడు.

'నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం జాక్ క్రాలీ వికెట్ విషయం టెక్నాలజీ పరంగా తప్పు జరిగింది. ఈ మాటకు నేను కట్టుబడి ఉంటాను. ఆటలో టెక్నాలజీ కూడా 100 శాతం కరెక్ట్‌గా ఉండదనే అంపైర్స్ కాల్ రూల్‌ను అమల్లో పెట్టారు. టెక్నాలజీ పరంగా క్లారిటీ లేనప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడుతారు.

జాక్ క్రాలీ విషయంలో టెక్నాలజీ పరంగా 100 శాతం కరెక్ట్‌గా అనిపించలేదు. అందుకే తప్పిదం జరిగిందని అంటున్నాం. అయితే ఈ మ్యాచ్‌లో మేం విజయం సాధించకపోవడానికి ఇదే కారణమని మాత్రం చెప్పడం లేదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తీసుకోలేరు.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, February 5, 2024, 19:43 [IST]
Other articles published on Feb 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+