Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: చరిత్ర సృష్టించిన బెన్ డక్కెట్..!

ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డక్కెట్ చరిత్ర సృష్టించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. బజ్‌బాల్ బ్యాటింగ్‌తో 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్‌ గడ్డపై అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి ఇంగ్లండ్ ప్లేయర్‌గా నిలిచాడు.

ఓవరాల్‌గా భారత్‌తో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన మూడో ప్లేయర్‌గా బెన్ డక్కెట్ చరిత్రకెక్కాడు. అతని కంటే ముందు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (84 బంతుల్లో) క్లైవ్ లాయడ్(85 బంతుల్లో) శతకాలను అందుకున్నారు.

సెంచరీ మార్క్ అందుకునే సమయానికి అతను 19 ఫోర్లతో పాటు ఓ సిక్స్ బాదాడు. నిర్దాక్షిణ్యంగా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ 32 ఓవర్లలో 2 వికెట్లకు 196 పరుగులు చేసింది. క్రీజులో బెన్ డక్కెట్(129 బ్యాటింగ్)తో పాటు జోరూట్(2 బ్యాటింగ్) ఉన్నారు.

IND vs ENG: Ben Duckett slams fastest Test Hundred by any England players in India

జాక్ క్రాలీ(15), ఓలిపోప్(39) విఫలమయ్యారు. జాక్ క్రాలీ‌తో తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించిన బెన్ డక్కెట్.. ఓలీపోప్‌తో రెండో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం అందించాడు. భారత బౌలర్లలో సిరాజ్, అశ్విన్ చెరో వికెట్ తీసారు.

విదేశాల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు:

హారీ బ్రూక్- రావల్పిండి 2022- 80 బాల్స్

జాక్ క్రాలీ- రావల్పిండి 2022- 86 బాల్స్

కెవిన్ పీటర్సన్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్ 2009- 86 బాల్స్

బెన్ డక్కెట్- రాజ్‌కోట్ 2024- 88 బాల్స్*

ఓలిపోప్- రావల్పిండి 2022- 90 బంతులులు

భారత గడ్డపై టీమిండియాపై ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్లు

ఆడమ్ గిల్‌క్రిస్ట్- ముంబై వాంఖడే 2001- 84 బాల్స్

క్లైవ్ లాయడ్- బెంగళూరు 1974- 85 బాల్స్

బెన్ డక్కెట్- రాజ్‌కోట్ 2024- 88 బాల్స్*

రాస్ టేలర్- బెంగళూరు 2012- 99 బాల్స్

భారత్ 445 ఆలౌట్

అంతకుముందు 326/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 445 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌తో 112), రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) శతకాలతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

రవిచంద్రన్ అశ్విన్(89 బంతుల్లో 6 ఫోర్లతో 37), ధ్రువ్ జురెల్(104 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జస్‌ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) సైతం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(4/114) నాలుగు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్‌లీ, జోరూట్ తలో వికెట్ పడగొట్టారు. రెహ్మాన్ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Story first published: Friday, February 16, 2024, 17:04 [IST]
Other articles published on Feb 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+