భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో తమ తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆడుతోంది. బెన్ డక్కెట్(118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) విధ్వంసకర శతకంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 35 ఓవర్లలో 2 వికెట్లకు 207 పరుగులు చేసింది. క్రీజులో బెన్ డక్కెట్‌తో పాటు జోరూట్(9 బ్యాటింగ్) ఉన్నాడు. జాక్ క్రాలీ(15), ఓలిపోప్(39) తర్వగా ఔటయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్, సిరాజ్ తలో వికెట్ తీసారు.
అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌తో 112), రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) శతకాలతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

రవిచంద్రన్ అశ్విన్(89 బంతుల్లో 6 ఫోర్లతో 37), ధ్రువ్ జురెల్(104 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జస్‌ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) సైతం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(4/114) నాలుగు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్‌లీ, జోరూట్ తలో వికెట్ పడగొట్టారు. రెహ్మాన్ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ 238 పరుగుల వెనుకంజలో ఉంది.
ఓవర్‌నైట్ బ్యాటర్లు విఫలం..
326/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. వరుస ఓవర్లలోనే ఓవర్‌నైట్ బ్యాటర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఔటయ్యారు. అండర్సన్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేరగా.. జోరూట్ వేసిన మరుసటి ఓవర్‌లో జడేజా రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఇద్దరూ తమ ఓవర్ నైట్ స్కోర్‌కు చెరో రెండు పరుగులు మాత్రమే జోడించారు.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్, ధ్రువ్ జురెల్ ఆచితూచి ఆడారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ధ్రువ్ జురెల్ సెహ్వాగ్ తరహాలో భారీ సిక్సర్లు బాదాడు. మిడిల్ పిచ్‌పై పరుగెత్తిన అశ్విన్‌ను మందలించిన అంపైర్.. 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. ఈ విషయంపై అంపైర్‌తో అశ్విన్ వాగ్వాదానికి దిగాడు. ఇక భారత్ 388/7 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే రవిచంద్రన్ అశ్విన్(37)ను రెహాన్ అహ్మద్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో 8వ వికెట్‌కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన ధ్రువ్ జురెల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన సిరాజ్(3 నాటౌట్)తో కలిసి బుమ్రా ధాటిగా ఆడాడు. మూడు బౌండరీలు ఓ సిక్సర్ సాయంతో చివరి వికెట్‌కు 30 పరుగులు జోడించాడు.
ఇంగ్లండ్ దూకుడు..
అశ్విన్ పెనాల్టీ కారణంగా ఇంగ్లండ్ 5 పరుగులతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. బెన్ డక్కెట్ దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ 31/0 స్కోర్‌తో ట్ బ్రేక్‌కు వెళ్లింది. చివరి సెషన్‌లోనూ బెన్ డక్కెట్ దూకుడుగా ఆడాడు. టీ20 తరహాలో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు జాక్ క్రాలీ ఇబ్బంది పడినా.. బెన్ డక్కెట్ స్వేచ్చగా బ్యాటింగ్ చేశాడు. 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
89 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీ అశ్విన్ విడదీసాడు. జాక్‌క్రాలీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్‌తో అశ్విన్ టెస్ట్‌ల్లో 500 వికెట్ల మైలు రాయి అందుకున్నాడు. క్రీజులోకి వచ్చిన ఓలిపోప్ సైతం సాధికారికంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. 18.1 ఓవర్లలోనే ఆ జట్టు 100 పరుగులు పూర్తి చేసుకుంది.
శతక్కొట్టిన బెన్ డక్కెట్..
మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన బెన్ డక్కెట్ 88 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. భారత గడ్డపై అత్యంత వేగంగా శతకం బాదిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. సెంచరీ అనంతరం కూడా అతనే అదే జోరు కనబర్చాడు. ఓలిపోప్ సైతం బౌండరీలు బాదాడు. రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ రివ్యూకు ఓలిపోప్ ఎల్బీగా వెనుదిరిగాడు.
దాంతో రెండో వికెట్‌కు నమోదైన 93 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన జోరూట్‌తో కలిసి మరో వికెట్ పడకుండా బెన్ డక్కెట్ రెండో రోజు ఆటను ముగించారు.