Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బంతితో ఫీల్డర్‌ను కొట్టాడు!(వీడియో)

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఫీల్డర్ బెన్ డకెట్ బంతిని వికెట్ల వైపు బలంగా విసరగా మధ్యలో ఉన్న హ్యారీ బ్రూక్‌కు బలంగా తాకింది. బంతి గట్టిగా తాకడంతో బ్రూక్ నొప్పితో విలవిలలాడాడు. వెంటనే బెన్ డకెట్ అతనికి క్షమాపణలు చెప్పాడు. ఈ అనూహ్య ఘటనకు అందరూ అవాక్కయ్యారు. డగౌట్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు సైతం అయ్యో అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి.

భారత తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో షోయబ్ బషీర్ వేసిన 98వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని పంత్.. షార్ట్ థర్డ్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసాడు. బంతిని అందుకున్న డకెట్.. కీపర్‌వైపు బలంగా విసిరాడు. కానీ బంతి మధ్యలో ఉన్న హ్యారి బ్రూక్ పక్కటెముకల భాగంలో బలంగా తాకింది. గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

IND vs ENG Ben Duckett s dangerous throw hit Harry Brook on Day 2 Video

బషీర్ వేసిన 100వ ఓవర్‌లో పంత్ 99 పరుగుల వద్ద సిక్సర్ బాది 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం పిల్లి మొగ్గలు వేసి సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇది పంత్‌కు ఏడో టెస్ట్ సెంచరీ కాగా.. భారత్ తరఫున అత్యధిక సెంచరీలు నమోదు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ధోనీ(6 సెంచరీలు) రికార్డ్‌ను అధిగమించాడు.మరికాసేపట్లో తొలి సెషన్ ముగుస్తుందనగా భారత్ వెనువెంటనే 4 వికెట్లు కోల్పోయింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కెప్టెన్ గిల్ క్యాచ్ ఔటవ్వగా.. కరుణ్ నాయర్ డకౌటయ్యాడు. పంత్ ఎల్బీగా వెనుదిరిగాడు. శార్దూల్ ఠాకూర్‌ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో లంచ్ బ్రేక్ సయమానికి భారత్ 454/7 స్కోర్‌తో నిలిచింది. క్రీజులో జడేజా(2 బ్యాటింగ్) ఉన్నాడు. 25 పరుగుల వ్యవధిలోనే భారత్ 4 వికెట్లు కోల్పోయింది.

Story first published: Saturday, June 21, 2025, 17:53 [IST]
Other articles published on Jun 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+