For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: బుమ్రా ఔట్.. వరుణ్ చక్రవర్తీ ఇన్!

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్న వరుణ్ చక్రవర్తీకి ప్రమోషన్ ఇస్తూ.. వన్డే జట్టులోకి తీసుకోంది. మరోవైపు వెన్నుగాయంతో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రాను జట్టు నుంచి తప్పించింది.

ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 'పురుషుల సెలెక్షన్ కమిటీ వరుణ్ చక్రవర్తీని ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడే భారత జట్టులోకి ఎంపిక చేశారు. ఇటీవలే ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లో వరుణ్ చక్రవర్తీ 14 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ ప్రదర్శనతోనే అతన్ని వన్డే జట్టులోకి తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తీ ఇప్పటికే భారత జట్టుతో కలిసాడు.'అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.

IND vs ENG BCCI Announce Varun Chakravarthy added to India s squad for ODI series against England

ఈ ప్రకటనలో జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయం గురించి బీసీసీఐ ఎలాంటి విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ రివైజ్డ్ వన్డే టీమ్ నుంచి అతని పేరును తొలగించింది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా పేరును పేర్కొన్న సెలెక్టర్లు.. అతని ఫిట్‌నెస్ సాధిస్తే ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఆడుతారని చెప్పారు. కానీ ఇప్పుడు అతని పేరునే తొలగించారు.

రవిచంద్రన్ అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తీని ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడించాలని డిమాండ్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించాలనే ఉద్దేశంతోనే వరుణ్ చక్రవర్తీని ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది. గురువారం(ఫిబ్రవరి 6) నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి వన్డేతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

ఇక ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుండగా.. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలోనే వరుణ్ చక్రవర్తీని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో సత్తా చాటితే అతను ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడే అవకాశం ఉంది.

భారత రివైజ్డ్ వన్డే టీమ్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.

Story first published: Tuesday, February 4, 2025, 18:49 [IST]
Other articles published on Feb 4, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+