భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీ చరిత్రకెక్కింది. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ సిరీస్‌లో 9 మంది బ్యాటర్లు 400 ప్లస్ రన్స్ నమోదు చేయడం ఇదే తొలిసారి. ఒకప్పుడు ఇంగ్లండ్ కండిషన్స్ బ్యాటింగ్‌కు సవాల్‌గా ఉండాయి. కానీ ఇంగ్లండ్ బాజ్‌బాల్ అప్రోచ్‌తో బ్యాటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో పిచ్‌లన్నీ మారిపోయాయి. తాజాగా జరుగుతున్న సిరీస్‌లోనూ మైదానాలన్నీ బ్యాటింగ్‌కు ఫ్రెండ్లీగా మారాయి. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు బ్యాట్ ఝులిపించారు. దాంతో ఆల్‌టైమ్ రికార్డులన్నీ బద్దలయ్యాయి.
93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సిరీస్‌లో ముగ్గురు బ్యాటర్లు 500+ రన్స్ నమోదు చేశారు. 754 పరుగులతో శుభ్‌మన్ గిల్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా 500 ప్లస్ రన్స్ చేశారు. ఇంగ్లండ్ తరఫున జోరూట్, హ్యారీ బ్రూక్ 400 ప్లస్ రన్స్ నమోదు చేశారు. ఈ సిరీస్‌లో ఇరు జట్లలో కలిపి మొత్తం 9 మంది బ్యాటర్లు 400 ప్లస్ రన్స్ చేశారు.

148 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఏ సిరీస్‌లో 9 మంది బ్యాటర్లు ఇలా 400 ప్లస్ పరుగులు చేయలేదు. గతంలో వెస్టిండీస్.. ఆస్ట్రేలియా పర్యటన 1975-76లో ఇరు జట్ల నుంచి 8 మంది ఆటగాళ్లు 400 ప్లస్ రన్స్ చేశారు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు కలిపి 7000+ రన్స్ చేశాయి. 1993 యాషెస్ సిరీస్‌లో చివరిసారిగా 7000 ప్లస్ రన్స్ రికార్డ్ నమోదైంది.
అండర్సన్-సచిన్ ట్రోఫీలో 400 ప్లస్ రన్స్ చేసిన బ్యాటర్ల జాబితా
శుభ్‌మన్ గిల్ 754
కేఎల్ రాహుల్ 532
రవీంద్ర జడేజా 516
జోరూట్ 511*
రిషభ్ పంత్ 479
హ్యారీ బ్రూక్ 472*
బెన్ డకెట్ 462
జెమీ స్మిత్ 432
యశస్వి జైస్వాల్ 411