IND vs ENG: అందరికంటే నేనే బుద్ధిమంతుడుని అన్న పంత్.. ఆటాడుకున్న టీమిండియా ప్లేయర్స్!!

లీడ్స్: టీమిండియాలో అల్లరి పిల్లగాళ్లు చాలా మందే ఉన్నారు. యుజ్వేంద్ర చహల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్.. డ్రెసింగ్ రూమ్, మైదానంలో తెగ ఆల్లరిచేస్తుంటారు. ముఖ్యంగా వికెట్ కీపర్ పంత్. అతడు క్రికెట్ ఫీల్డ్‌లో ఓ ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థులను నిత్యం కవ్విస్తుంటాడు. మాటకు మాట బదులిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడూ తన బ్యాట్‌తో కూడా సమాధానం ఇస్తుంటాడు.
ఏదేమైనా డ్రెస్సింగ్ రూమ్‌లో, బయట మాత్రం సరదాగా ఉంటాడు. తన మాట, చేష్టలతో సహచరులతో పాటు జట్టు సిబ్బంది అందరినీ నవ్విస్తుంటాడు. తాజాగా పంత్ పంచుకున్న ఓ పోస్టు నెట్టింట వైరల్ అయింది. అంతేకాదు నవ్వులు కూడా పూయిస్తోంది.

నేనే బుద్ధిమంతుడుని
టెస్టు సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న రిషబ్ పంత్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటోను పంచుకున్నాడు. ఆ ఫొటోలో రంగురంగుల హుడీ, షార్ట్‌తో పాటు రెండు కలర్ల (ఎరుపు, నీలం) సాక్సులు ధరించి కాస్త విచిత్రంగా ఉన్నాడు. 'క్లాస్‌లో అందరికంటే బుద్ధిమంతుడు' అంటూ హిందీలో కాప్షన్ రాసుకొచ్చాడు. నవ్వుతున్న ఎమోజీలను కూడా ఆ ఫొటోకు జత చేశాడు. దీంతో అది కాస్త నెట్టింట వైరల్ అయింది. పంత్ కామెడీ పోస్టుపై.. మరో క్రికెటర్, ఐపీఎల్ జట్టు సభ్యుడు అక్షర్ పటేల్ అంతే కామెడీగా స్పందించాడు. ఆ ఫొటోను తానే తీశానని తెలియజేసేలా.. 'బుద్ధిమంతుడివి నువ్వు కాదు.. ఆ ఫొటో తీసిన వ్యక్తి' అంటూ కామెంట్ చేశాడు.
ఇశాంత్ సెటైర్
అక్షర్ పటేల్ కామెంట్‌పై మరో ఢిల్లీ క్యాపిటల్ సభ్యుడు ఇశాంత్ శర్మ సెటైర్ వేశాడు. మీరిద్దరూ అమాయకులా? అన్నట్లు తెలిపేలా కామెంట్ పెట్టాడు. ఈ క్రికెటర్ల సంభాషణ చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
'రిషబ్ పంత్.. బుద్ధిమంతుడా?' అని ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. 'దేవుడా ఇది నేను నమ్మను' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. గత రెండుళ్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పంత్.. ఎట్టకేలకు ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ ద్వారా ఫామ్ అందుకున్నాడు. అప్పటినుంచి జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు.
'లార్డ్స్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాం.. ఇకపై ఎలాంటి వివాదాలకు పోము! సరైన ఆట ఆడాలనుకుంటున్నాం'

25 నుంచి మూడో టెస్ట్
భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ గడ్డపై పర్యటిస్తోంది. వర్షం కారణంగా మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సమయోచిత ఇన్నింగ్స్‌తో పాటు మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా అద్భుత పోరాటం.. మొహ్మద్ సిరాజ్ సంచలన బౌలింగ్‌తో రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీసులో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈనెల 25 నుంచి జరగనున్న మూడో టెస్టులోనూ ఇదే ఊపు కొనసాగించి ఐదు టెస్టుల సిరీస్‌లో లీడ్ తీసుకోవాలని కోహ్లీ సేన ఆశిస్తోంది.

జడేజా వైపే కెప్టెన్ మొగ్గు
మూడో టెస్ట్ కోసం భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని సమాచారం తెలుస్తోంది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ ఫార్ములాతోనే భారత్ బరిలోకి దిగనుందట. కెప్టెన్ విరాట్ కోహ్లీ పేస్ విభాగంలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదట. మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మలనే తుది జట్టులోకి తీసుకోనున్నాడట. బ్యాటింగ్ చేయగల రవీంద్ర జడేజా వైపే కెప్టెన్ మొగ్గుచోపుతున్నాడట. దీంతో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మరోసారి నిరాశే ఎదురుకానుంది. ఇక చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలను కూడా కోహ్లీ మద్దతు ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications