For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. చాహల్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!

టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్ తొలి స్పెల్‌లోనే 2 వికెట్లు పడగొట్టి ఈ ఘనతను సాధించాడు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. తొలి ఓవర్‌లోనే ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్(0)ను అర్ష్‌దీప్ సింగ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో మరో ఓవపెనర్ బెన్ డకెట్(4) క్యాచ్ ఔట్‌ చేశాడు. ఈ రెండు వికెట్లతో యుజ్వేంద్ర చాహల్ రికార్డ్‌ను అధిగమించాడు. 80 టీ20ల్లో యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ 61 టీ20ల్లోనే 97 వికెట్లు తీసి అతన్ని వెనక్కినెట్టాడు.

IND vs ENG Arshdeep Singh becomes India s leading T20I wicket-taker after breaks Chahal s record

ఈ జాబితాలో అర్ష్‌దీప్ సింగ్(97), యుజ్వేంద్రచాహల్(96) తర్వాత భువనేశ్వర్ కుమార్(87 టీ20ల్లో 90 వికెట్లు), జస్‌ప్రీత్ బుమ్రా(71 టీ20ల్లో 89 వికెట్లు) కొనసాగుతున్నారు. ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్ల మైలు రాయి అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్రకెక్కనున్నాడు. 2022లోనే అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ సింగ్ రెండేళ్ల వ్యవధిలోనే 100 వికెట్ల మైలురాయికి చేరువయ్యాడు. ఈ ప్రదర్శనతోనే అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు అండగా.. వరుణ చక్రవర్తీ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో జోస్ బట్లర్(43 బ్యాటింగ్)తో పాటు జకోబ్ బెతెల్(1 నాటౌట్) ఉన్నాడు.

Story first published: Wednesday, January 22, 2025, 19:55 [IST]
Other articles published on Jan 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+