Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: సంజూ.. ఈ ఒక్కసారి నా మాట విను: అంబటి రాయుడు

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక సలహా ఇచ్చాడు. ఈ ఒక్కసారి తన మాట విని ఆడాలని సూచించాడు. ఇంగ్లండ్‌తో తొలి మూడు టీ20ల్లో ఈ ఇద్దరు బ్యాటర్లు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.

సంజూ శాంసన్ అయితే మూడు మ్యాచ్‌ల్లో ఒకే తరహాలో ఔటయ్యాడు. మూడు టీ20ల్లొ 26, 5, 3 పరుగులే చేశాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో షార్ట్ పిచ్ బాల్స్ ఆడలేక వికెట్ పారేసుకున్నాడు. మరోవైపు సూర్య సైతం 0, 12, 14 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి బ్యాటర్లకు రాయుడు విలువైన సలహా ఇచ్చాడు.

IND vs ENG Ambati Rayudu advises Sanju Samson over pull shot technique against Jofra Archer

ఒక్క స్పెల్ అతన్ని వదిలేయ్..
జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌ను జాగ్రత్తగా ఆడాలని సంజూ శాసంన్‌కు సూచించాడు. అతన్ని వదిలేసి ఇతర బ్యాటర్లపై ఎదురు దాడికి దిగాలని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్.. క్రీజులో సెట్ అవ్వడానికి టైమ్ తీసుకోవాలన్నాడు. సూర్యకు ఇంగ్లండ్ బౌలర్లు తెలివిగా స్లోయర్ బాల్స్ వేస్తున్నాడని చెప్పాడు.

'సంజూ శాంసన్‌‌ షార్ట్ బాల్స్‌కు ఔటవ్వడం బలహీనత కాదు. సాంకేతిక లోపం మాత్రమే. ఇలా సంజూ ఔటవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క స్పెల్ తన వికెట్‌ను కాపాడుకొని ఇతర బౌలర్లపై ఎదురు దాడికి దిగాలి. ఆర్చర్ బౌలింగ్‌ను ఆచితూచి ఆడి మిగతా బౌలర్లపై షాట్స్ ఆడాలి.

తెలివిగా బౌలింగ్ చేస్తున్నారు..
సూర్యకు ఇంగ్లండ్ బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం పేస్ ఇవ్వడం లేదు. ఆ వికెట్‌పై పేస్ బౌన్స్ కూడా లేదు. సూర్యకు వ్యతిరేకంగా ప్రతీ బౌలర్ ప్రణాళికతో బౌలింగ్ చేస్తున్నారు. స్లోయర్ బాల్స్ వేస్తున్నారు. ఎందుకంటే అతను పేస్‌కు వ్యతిరేకంగా అద్భుతమైన షాట్స్ ఆడుతాడు. కాబట్టి సూర్య కాస్త సమయం తీసుకొని ఆడాలి. క్రీజులో కాస్త సమయం కేటాయించడంపై సూర్య ఫోకస్ పెట్టాలి. అలా చేస్తే షాట్స్ అన్ని సునాయసంగా ఆడవచ్చు.

జరిగి ఆడవద్దు..
సంజూ శాంసన్ ఆలోచన విధానంలో సమస్య ఉందని నేను అనుకోవడం లేదు. ఇది సాంకేతిక లోపం మాత్రమే. ఎందుకంటే అతను జరిగి షాట్ ఆడాలనుకుంటన్నాడు. అలా జరిగి లెగ్ సైడ్ పుల్ షాట్ ఆడితే చేతులు ఓపెన్ అవ్వవు. అలా ఆడుతున్నప్పుడు బంతి కూడా మనల్ని వెంటాడుతోంది. కాబట్టి లేట్‌గా ఆడే అవకాశాలు ఎక్కువ అవుతాయి. సంజూ లైన్‌లోకి వచ్చి పేస్ ఆడాలి. సంజూ షార్ట్ బాల్స్‌ను బాగా ఆడుతాడు. అతన్ని ఇబ్బంది పెట్టేది షార్ట్ బాల్స్ కాదు.. ఆడే యాంగిల్ మాత్రమే.'అని రాయుడు చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, January 30, 2025, 18:52 [IST]
Other articles published on Jan 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+