For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అది అశ్విన్ అతి తెలివి: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డ్ అంపైర్ మందలింపునకు గురైన విషయం తెలిసిందే. బ్యాటింగ్ సందర్భంగా అశ్విన్ మిడిల్ పిచ్‌పై పరుగెత్తాడు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్ జోయోల్ విల్సన్.. అశ్విన్‌ను మందలించడంతో పాటు భారత్‌కు 5 పరుగుల పెనాల్టీ విధించాడు. పెనాల్టీ విధించడాన్ని తప్పుబట్టిన అశ్విన్.. అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.

ఇక అశ్విన్ తప్పిదం కారణంగా ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ చేయకుండానే 5 పరుగులు లభించాయి. దాంతో ఆ జట్టు 5/0 స్కోర్‌తో తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ను ప్రారంభించింది.

 IND vs ENG: Alastair Cook slams R Ashwin for deliberately running on pitch

అయితే మిడిల్‌ పిచ్‌పై అశ్విన్ ఉద్దేశపూర్వకంగానే పరుగెత్తాడని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అలిస్టర్ కుక్ ఆరోపించాడు. పిచ్‌పై క్రాక్స్ వస్తే బౌలింగ్ చేసేందుకు అనుకూలంగా మారుతుందనే ఈ పని చేశాడని చెప్పాడు. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అలిస్టర్ కుక్.. ఈ ఘటన జరిగిన సమయంలో ఈ కామెంట్స్ చేశాడు.

'ఇది ఉద్దేశపూర్వకంగానే చేశాడా? అంటే అవుననే చెబుతా. తాను బౌలింగ్ చేసేటప్పుడు స్పిన్‌కు అనుకూలించాలని పిచ్‌పై పగుళ్లు వచ్చేలా పరుగెత్తే ప్రయత్నం చేశాడు. ఇది అశ్విన్ పన్నిన పన్నాగం. ఇది ఏ మాత్రం స్పూర్తి దాయకం కాదు.'అని అలిస్టర్ కుక్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లోనే అశ్విన్.. టెస్ట్‌ల్లో 500 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.

జాక్‌ క్రాలీని ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు. జాక్‌క్రాలీని ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు. అత్యంత వేగంగా 500 వికెట్ల మైలు రాయి అందుకున్న తొలి భారత బౌలర్‌గా.. రెండో స్పిన్నర్‌గా అశ్విన్ చరిత్రకెక్కాడు. అశ్విన్ 98 టెస్ట్‌ల్లో ఈ ఫీట్ సాధిస్తే.. కుంబ్లే 105 టెస్ట్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఓవరాల్‌‌గా వేగంగా 500 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు.
టాప్‌లో శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీథరన్ ఉన్నాడు.

Story first published: Friday, February 16, 2024, 21:20 [IST]
Other articles published on Feb 16, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+