ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. ఈ సిరీస్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్‌లోనూ టాస్ గెలవలేదు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తాత్కలిక కెప్టెన్ ఓలీ పోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ పిచ్‌పై బౌలింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేం మా కెప్టెన్‌ను మిస్సయ్యాం. కానీ ఇతర ఆటగాళ్లతో జట్టు బలంగానే ఉంది. తుది జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చారు. మాకు డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది. గస్ అట్కిన్సన్, ఓవర్టన్ కూడా పరుగులు చేయగలరు. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం.'అని ఓలీ పోప్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ ఓడినా తమకు జరిగే నష్టం ఏం లేదని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. 'మేం విజయాలు సాధించినంత కాల టాస్ మాకు పెద్ద సమస్యే కాదు. తుది జట్టు ఎంపికపై నిన్న కాస్త గందరగోళానికి గురయ్యాం. వాతావరణం కాస్త మేఘావృతమై ఉంది. కానీ పిచ్ బాగుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయాలనుకుంటున్నాం. ఈ వికెట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా.

తుది జట్టులో మూడు మార్పులు చేశాం. రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్, బుమ్రా ప్లేస్‌లో ప్రసిధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చారు. బ్యాటింగ్ డెప్త్ కోసమే కరుణ్ నాయర్‌ను తుది జట్టులోకి తీసుకున్నాం. మేం ప్రతీ మ్యాచ్ గెలవాలనుకుంటాం. ఈ సిరీస్‌లో మేం గెలుపు ముంగిట ఓడిపోయాం. 5-10 శాతం అదనపు కృషి పెడితే విజయం దక్కుతుంది. మా కుర్రాళ్లంతా ఈ మ్యాచ్ కోసం సిద్దంగా ఉన్నారు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
అందరూ ఊహించనట్లుగానే టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఈ మ్యాచ్‌లోనూ అవకాశం దక్కలేదు. టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తుది జట్లు:
భారత్ : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్.