టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 60కి పైగా క్యాచ్‌లు పట్టిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో మార్క్ వుడ్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడం ద్వారా హిట్ మ్యాన్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
రవిచంద్రన్ అశ్విన్ వేసిన 50 ఓవర్ నాలుగో బంతికి మార్క్‌వుడ్(0) స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. టెస్ట్‌ల్లో రోహిత్ శర్మకు ఇది 60వ క్యాచ్. ఇప్పటి వరకు 59 టెస్ట్‌లు ఆడిన రోహిత్ 60 క్యాచ్‌లు అందుకున్నాడు. 262 వన్డేల్లో 93 క్యాచ్‌లు, 151 టీ20ల్లో 60 క్యాచ్‌లు పట్టుకున్నాడు. ఇలా మూడు ఫార్మాట్లలో 60 క్యాచ్‌లు అందుకున్న ఏకైక ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

ఓవరాల్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ 29వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు అతను మూడు ఫార్మాట్లలో కలిపి 213 క్యాచ్‌లు అందకున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజ ప్లేయర్ జయవర్దనే 440 క్యాచ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. 652 మ్యాచ్‌ల్లో అతను ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్‌లో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లీ 314 క్యాచ్‌లతో ఆరో స్థానంలో నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్‌కు దిగగా.. భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రఫ్ఫాడించాడు. అతని (5/72) ధాటికి జాక్ క్రాలీ మినహా మరే బ్యాటర్ రాణించలేదు. బెన్ డక్కెట్(27), ఓలీ పోప్(11), జోరూట్(26), జానీ బెయిర్ స్టో(29), బెన్ స్టోక్స్(0), టామ్ హార్ట్‌లీ(6), మార్క్ వుడ్(0)లు పోటాపోటీగా పెవిలియన్ చేరారు.
దాంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. క్రీజులో షోబయ్ బషీర్(7 బ్యాటింగ్), బెన్ ఫోక్స్(23 బ్యాటింగ్) ఉన్నారు. సెకండ్ సెషన్ ముగిసే సమయానికి ఇంగ్లండ్ 56.3 ఓవర్లలో 8 వికెట్లకు 214 రన్స్ చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ రెండు, జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.