IND vs ENG: భారత అభిమానులపై జాతి వివక్ష వ్యాఖ్యలు! కర్రె ల**కొడుకులంటూ..!

బర్మింగ్‌హామ్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్‌లో జాతి వివక్ష వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ మ్యాచ్‌కు హాజరైన భారత్ అభిమానులను టార్గెట్ చేస్తూ కొందరూ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని భారత్ ఆర్మీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. అక్కడున్న భద్రతా సిబ్బందికి పలుమార్లు ఈ విషయాన్ని తెలియజేసి నిందితులను చూపించినా వారు పట్టించుకోలేదని ఆరోపించింది. రాయలేని బూతు పదాలతో తమను తిట్టారని వాపోయింది. ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)ని ట్యాగ్ చేస్తూ తమకు జరిగిన అవమానాన్ని ప్రపంచానికి తెలియజేసింది.
పేట్రేగిపోయిన ఇంగ్లండ్ ఫ్యాన్స్..
ఆలస్యంగా ఈ ఘటనపై స్పందించిన ఈసీబీ భారత అభిమానులకు క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేసింది. ఈ ఊహించని ఘటనపై సమగ్రదర్యాప్తు చేస్తున్నామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది. భారత అభిమానులకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ భారత్ ఆర్మీ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. 'మా ఆర్గనైజేషన్‌లోని చాలా మంది ఈ రోజు జాతి వివక్షను ఎదుర్కొన్నారని చెప్పడానికి చింతిస్తున్నాం. ఈ విషయంపై ఎడ్జ్‌బాస్టన్ అధికారులతో పని చేస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తం'అని పేర్కొంది. ఈ ఆర్గనైజింగ్ సంస్థలోని ఓ మెంబర్.. మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనను తన ట్వీట్‌లో వివరించాడు.
కర్రె ల కొడుకులంటూ..
'ఎడ్జ్‌బాస్టన్‌లో భారత అభిమానులు జాతి వివక్షను ఎదుర్కొన్నారు. ఎరిక్ హోల్లీస్ బ్లాక్ నెంబర్ 22లో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా మంది ఇంగ్లండ్ అభిమానులు మమ్మల్ని కర్రె లం*కొడుకులు, పాకీ బాస్టర్డ్స్ అని పిలుస్తూ అవమానపరిచారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న భద్రతా సిబ్బందికి కనీసం 10 సార్లు ఫిర్యాదు చేసినా.. నిందితులను చూపించినా వారు పట్టించుకోలేదు. 'అని సదరు అభిమాని పేర్కొన్నాడు.

చింతిస్తున్నాం..
మ్యాచ్ నిర్వాహకులు ట్విటర్ వేదికగా ఈ ఘటనపై స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఇలాంటి ఘటనలు ఏమాత్రం సహించినవని, వీలైనంత త్వరగా దర్యాప్తు జరుపుతామని పేర్కొన్నారు. క్రికెట్‌లో వివక్ష తావులేదని, జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని ఈసీబీ ట్వీట్ చేసింది. ఈ ఘటనపై వీలైనంత త్వరగా విచారణ జరపాలని నిర్వాహకులను ఆదేశించామని పేర్కొంది.

గెలుపు ముంగిట ఇంగ్లండ్:
భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)
భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 57 ఓవర్లలో 259/3 (బెయిర్ స్టో 72 బ్యాటింగ్, జోరూట్ 76 బ్యాటింగ్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications