Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG 5th Test: అతనిపై వేటు.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్!

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే చివరి మ్యాచ్‌‌కు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. జట్టులో ఒకే ఒక మార్పు చేసిన ఇంగ్లండ్.. ఓలి రాబిన్సన్ స్థానంలో మార్క్‌వుడ్‌కు అవకాశం కల్పించింది. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ తమ తుది జట్టును ఒక రోజు ముందుగానే ప్రకటిస్తోంది. ఆ సంప్రదాయాన్ని ఈ సిరీస్‌లో కూడా కొనసాగించింది.

ఇప్పటికే 1-3తో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి గౌరవంగా భారత పర్యటనను ముగించాలనుకుంటోంది. చివరి మ్యాచ్ జరిగే ధర్మశాల పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. అదే జరిగితే ఇంగ్లండ్‌కు అడ్వాంటేజ్‌గా మారనుంది. పేస్ పిచ్‌ను అంచనా వేస్తున్న ఇంగ్లండ్.. అందుకుతగ్గట్లుగానే ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగింది. బెన్ స్టోక్స్ ఎక్స్‌ట్రా పేసర్‌గా సేవలందించనున్నాడు.

IND vs ENG 5th Test Mark Wood Replaces Ollie Robinson As England Announce Playing XI

ఆఖరి మ్యాచ్‌కు ర్యాంక్ టర్నర్‌ను తయారు చేసారనే వార్తల నేపథ్యంలో ఇంగ్లండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్లు షోయబ్ బషీర్, టామ్ హార్ట్‌లీ ఇద్దరినీ జట్టులో కొనసాగించింది. వీరికి తోడుగా జోరూట్ స్పిన్ బాధ్యతల పంచుకోనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న జానీ బెయిర్ స్టో‌ను తప్పించాల్సి ఉన్నా.. ధర్మశాల టెస్ట్ అతనికి కెరీర్‌లో 100వ మ్యాచ్ కావడంతో కొనసాగించింది. జాక్‌ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జోరూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ బ్యాటింగ్ బాధ్యతలు పంచుకోనుండగా.. మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్ పేస్ బౌలర్లుగా కొనసాగనున్నారు.

హైదరాబాద్ టెస్ట్‌లో విజయం సాధించి జోరు కనబర్చిన ఇంగ్లండ్.. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్ వైఫల్యంతో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది.

ఇంగ్లండ్ తుది జట్టు:

జాక్‌ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జోరూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్‌లీ, మార్క్‌వుడ్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్

Story first published: Wednesday, March 6, 2024, 15:00 [IST]
Other articles published on Mar 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+