For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: ఈ షాట్.. అరాచకం!(వీడియో)

ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కళ్లు చెదిరే షాట్‌తో ఔరా అనిపించాడు. భారత్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ స్వీప్ షాట్‌తో సిక్సర్ బాదాడు. ఈ షాట్‌కు భారత ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ప్రేక్షకులు సైతం అవాక్కయ్యారు. ఈ షాట్‌ను నమ్మలేక నోరెళ్లబెట్టారు. కామెంటేటర్లు సైతం అరాచకం అంటూ కొనియాడారు.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన 48వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ రెండో బంతిని సిరాజ్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వేయగా.. బ్రూక్ స్లాగ్ స్వీప్ షాట్‌తో ఫైన్ లెగ్ దిశగా సిక్సర్ తరలించాడు. ఈ క్రమంలో అతను క్రీజులో పడిపోయాడు. ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా.. రిషభ్ పంత్ ట్రేడ్ మార్క్ షాట్‌‌లా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ షాట్‌ను భారత ఆటగాళ్లు ఏ మాత్రం ఊహించలేదు.

IND vs ENG 5th Test Harry Brook Smashes Most Outrageous Shot Against Siraj Video

ఈ ఓవర్ అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఆ సమయానికి ఇంగ్లండ్ 48 ఓవర్లలో 8 వికెట్లకు 242 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(48 బ్యాటింగ్)‌తో పాటు జోష్ టంగ్(0 బ్యాటింగ్) ఉన్నాడు. మరో వికెట్ తీస్తే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియనుంది. గాయంతో జట్టుకు దూరమైన క్రిస్ వోక్స్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలీ(57 బంతుల్లో 14 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో రాణించగా.. బెన్ డకెట్(38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(4/60) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(3/83) మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్‌కు ఓ వికెట్ దక్కింది.

అంతకుముందు 204/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 69.4 ఓవర్లలో 224 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్(109 బంతుల్లో 8 ఫోర్లతో 57), వాషింగ్టన్ సుందర్(55 బంతుల్లో 3 ఫోర్లతో 26) నిరాశపర్చారు. మహమ్మద్ సిరాజ్(0), ప్రసిధ్ కృష్ణ(0) డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్(5/33) ఐదు వికెట్లు తీయగా.. జోష్ టంగ్(3/57) మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Friday, August 1, 2025, 21:59 [IST]
Other articles published on Aug 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+