టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్‌కు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ కరుణ్ నాయర్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించడంతో 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. తనకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలుచుకోలేకపోయాడు.
వరుసగా 6 ఇన్నింగ్స్‌ల్లో 0, 20, 31, 26, 40, 14 పరుగులే చేశాడు. దాంతో నాలుగో టెస్ట్ నుంచి కరుణ్ నాయర్‌ను తప్పించిన టీమిండియా మేనేజ్‌మెంట్.. సాయి సుదర్శన్‌కు అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సాయి.. హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన కరుణ్ నాయర్.. 6 అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. కరుణ్ నాయర్ కెరీర్ ముగిసిందని కామెంట్ చేశారు. కానీ అనూహ్యంగా ఆఖరి టెస్ట్‌లో కరుణ్ నాయర్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది.

అతని కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ పెద్ద రిస్క్ చేసింది. పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను తప్పించి ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా తీసుకుంది. బహుషా.. 'కరుణ్.. నీకు ఇదే ఆఖరి ఛాన్స్'అని చెప్పి ఉండొచ్చు. ఫ్యాన్స్ కూడా కరుణ్ నాయర్‌ను హెచ్చరిస్తున్నారు. ఈ అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. కొందరైతే.. 'ఓయ్ ఒక్క ఛాన్స్.. నీకిదే లాస్ట్ ఛాన్స్'అని కామెంట్స్ పెడుతున్నారు. గతంలో కరుణ్ నాయర్ 'డియర్ క్రికెట్.. ఒక్క ఛాన్స్ ఇవ్వు'అంటూ ట్వీట్ చేశాడు. అప్పట్లో ఈ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. కరుణ్ నాయర్ దురదృష్టమో ఏమో కానీ టీమిండియా అతనికి 6 అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(2), కేఎల్ రాహుల్(14) వికెట్లను కోల్పోయింది. అట్కిన్సన్ బౌలింగ్‌లో జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్(25 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్(15 బ్యాటింగ్) ఆచితూచి ఆడారు. ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేసి లంచ్ బ్రేక్‌ను ప్రకటించారు. తొలి సెషన్‌లో భారత్ 23 ఓవర్లలో 2 వికెట్లకు 72 పరుగులు చేసింది.