ఇప్పటికే ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. ముంబై వేదికగా ఆదివారం జరిగే చివరి టీ20లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఈ సిరీస్‌ను ఘనంగా ముగించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి గౌరవం కాపాడుకోవాలనుకుంటోంది.
గత మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. శివమ్ దూబే కంకషన్ సబ్‌స్టిట్యూషన్ హర్షిత్ రాణా(3/33) సంచలన ప్రదర్శనతో భారత్ గెలిచింది. అయితే అతని సబ్‌స్టిట్యూషన్ తీవ్ర విమర్శలకు దారి తీసింది.

షమీకి చోటు..
ఇప్పటికే ఈ సిరీస్ గెలవడంతో టీమిండియా తమ కాంబినేషన్‌లో మార్పులు చేయనుంది. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీకి అవకాశం ఇవ్వనుంది. కీలక వన్డే సిరీస్ ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం అతన్ని ఆడించనుంది. అతని కోసం అర్ష్‌దీప్ సింగ్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇవ్వవచ్చు. అక్షర్ పటేల్ స్థానంలో రమణ్‌దీప్ సింగ్‌ను ఆడించవచ్చు.
ఈ సిరీస్ టీమిండియా గెలిచినా.. టీమిండియా బ్యాటింగ్ తడబాటు కొనసాగుతోంది. ముఖ్యంగా సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్‌గా సంజూ 4 మ్యాచ్‌ల్లో 35 పరుగులే చేయగా.. సూర్య 26 పరుగులే చేశాడు. ఈ ఇద్దరూ రాణించాల్సిన అవసరం ఉంది. రింకూ సింగ్ ఫామ్ అందుకోవడం కలిసొచ్చే అంశం. కంకషన్ గాయానికి గురైన దూబే ఆఖరి టీ20 ఆడటం సందేహమే.
పిచ్ ఎలా ఉందంటే..?
వాంఖడే స్టేడియంలో సాధారణంగా పిచ్ బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ పరుగుల మోత మోగనుంది. ఆరంభంలో పేసర్లకు, తర్వాత స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. తేమ ప్రభావం ఉండనున్ననేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఈ మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.